ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో నిర్వహించిన 4.33 కోట్ల కోవిడ్ పరీక్షలలో 1.22 కోట్లకుపైగా పరీక్షలు గత రెండు వారాలలో నిర్వహించినవే.
గత 24 గంటలలో 10 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షల నిర్వహణ
22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే మెరుగైన టిపిఎం
Posted On:
01 SEP 2020 3:11PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న పరీక్షించు, గుర్తించు, చికిత్స అందించు విధాన మార్గనిర్దేశంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నందువల్ల కోవిడ్ బాధితులను తొలి దశలోనే గుర్తించి వారికి సత్వరం చికిత్స అందించడానికి వీలు కలుగుతోంది. దీనితో దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం పరీక్షలు ఈరోజుకు 4.3 కోట్ల దాటాయి. (4,33,24,834) ఇందులో 1,22,66,514 పరీక్షలు గత రెండు వారాలలోనే నిర్వహించినవే.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరీక్షల సామర్ద్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. గరిష్ఠస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తూ మొత్తం పరీక్షల సంఖ్య పెరిగేందుకుతోడ్పడుతున్న రాష్ట్రాలలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల పరీక్షలు, మొత్తం పరీక్షలలో 34 శాతం వరకు ఉ న్నాయి.
దేశంలో రోజుకు నిర్వహించే పరీక్షల సామర్ధ్యం 10 లక్షలు దాటింది. గత 24 గంటలలో 10,16,920 పరీక్షలు నిర్వహించారు. వారపు పరీక్షల సగటు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారపు సగటుపరీక్షలు జనవరి 2020 మొదటి వారం నుంచి ఇప్పటి వరకు నాలుగు రెట్లు పెరిగాయి. పరీక్షల నిర్ధారణ ప్రయోగశాలల నెట్‌వర్కును విస్తరించడం, దేశవ్యాప్తంగా సులభతర పరీక్షలకు ఏర్పాట్లు చేయడం వల్ల పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి పది లక్షలకు పరీక్షల సంఖ్య (టిపిఎం) గణనీయంగా పెరిగి 31,394 కుచేరింది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే మెరుగైన టిపిఎం కలిగి ఉన్నాయి. గోవా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లు రోజువారీ పరీక్షలను గరిష్ఠస్థాయిలో నిర్వహిస్తున్నాయి.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(Release ID: 1650375)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam