సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భరతమాతకు పుత్రశోకం: మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల కేంద్రమంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ సంతాపం
Posted On:
31 AUG 2020 7:59PM by PIB Hyderabad
భారత మాజీ ప్రధాని శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ తీవ్ర సంతాపం తెలియజేశారు.
" భరత మాత తన ముద్దుబిడ్డల్లో ఒకరైన భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీని కోల్పోయింది. శ్రీ ముఖర్జీ ఒక మేధావి మాత్రమే కాదు, నిర్ణయాత్మక శక్తి, వ్యూహకర్త, పార్లమెంటుకు అనేక సంవత్సరాల తరబడి వెన్నెముకగా నిలిచిన మహనీయుడు. పరిపాలనమీద ఆయన తనదైన ముద్ర వేశారు. భారత రాష్ట్రపతిగా ఒక స్పష్టమైన అవగాహనతో, హుందాగా బాధ్యతలు నెరిపారు" అని శ్రీ ప్రకాశ్ జావడేకర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
శ్రీ ప్రణబ్ ముఖర్జీ ప్రసగాలను ప్రచురించటానికి తాను ఆయన అనుమతి కోరినప్పుడు ఎంతో దయార్ద్రహృదయంతో అంగీకరించారని శ్రీ జావడేకర్ గుర్తు చేసుకున్నారు.
***
(Release ID: 1650217)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada