ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్ర‌జ‌ల‌కు హృదయపూర్వక ఓనం శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపరాష్ట్రపతి

Posted On: 30 AUG 2020 1:17PM by PIB Hyderabad

ఓనం ప‌ర్వ‌దినం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ విష‌యమై ఉపరాష్ట్రపతి ఒక సందేశాన్ని వెలువ‌రించారు.

ఈ సందేశం యొక్క పూర్తి వచనం ఇలా ఉంది:

ఓనం శుభ సందర్భంగా మన దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేరళలో నిజాయితీగల, న్యాయమైన, దయార్థుడు, దయగల పాలకుడైన‌ పురాణపు రాజు మహాబలి జ్ఞాపకార్థం ఓనం జరుపుకుంటారు. ఓనం రోజు సాంప్రదాయ ఆటలు, సంగీతం మరియు నృత్యం మరియు మ‌నోహ‌ర‌మైన గొప్ప విందైన ‘ఓనసాధ్య’తో ప్ర‌త్యేకంగా గుర్తింపు ఉంది. మహాబలి రాజును ఇళ్లలోకి, హృదయాల్లోకి ఆహ్వానించడానికి అందమైన పూల తివాచీలు వేస్తారు. ఈ ఓనం రోజున మ‌న భౌతికప‌ర‌మైన‌ శ్రేయస్సు జరుపుకునేటప్పుడు మ‌హా గొప్పరాజు మహాబలి అందించిన నిజాయితీ, సమగ్రత, దయ, కరుణ, నిస్వార్థత మరియు త్యాగం వంటి విలువలను గుర్తుచేసుకుందాం. ఓనం అనేది కుటుంబం మరియు స్నేహితులు కలిసి చేసుకునే సంబరాల సందర్భం. ఈ సంవత్సరం కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా మనం ఎదుర్కొంటున్న అనూహ్య‌మైన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. నా తోటి పౌరులను ఓనంను ఇంట్లో నిరాడంబరంగా జరుపుకోవాలని, కోవిడ్ ఆరోగ్యం, పరిశుభ్రత ప్రోటోకాల్‌కు కట్టుబడి జ‌రుపుకోవాల‌ని నేను కోరుతున్నాను. ఈ ఆనందకరమైన పండుగ మన దేశంలో శాంతి, శ్రేయస్సు మరియు ఆనందం యొక్క కొత్త శకానికి గాను నాంది పలకాలని కోరుకుంటున్నాను అన్నారు.

 

*****



(Release ID: 1649901) Visitor Counter : 157