రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలకు ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 30 AUG 2020 6:40PM by PIB Hyderabad

ఓనమ్‌ పండుగ సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షల సందేశమిచ్చారు.

    "కేరళ సోదర, సోదరీమణులతోపాటుపాటు, దేశప్రజలందరికీ ఓనమ్‌ శుభదిన శుభాకాంక్షలు. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఈ పండుగ ఒక చిహ్నం. కొత్త పంటలు చేతికి వచ్చిన సమయంలో భూమాతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఉత్సవం ఇది".

    "ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభం సమయంలో, పండుగల వేళల్లో, పేద ప్రజల పట్ల మనం దయ చూపాలి. మన కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మన సోదరభావాన్ని, సహృద్భావాన్ని, శ్రేయస్సును ఈ పండుగ పెంచాలని ఆకాంక్షిస్తున్నా".

రాష్ట్రపతి శుభాకాంక్షల సందేశాన్ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

***


(रिलीज़ आईडी: 1649875) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Tamil , Malayalam