ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం అత్యధికం:
27 లక్షలకు పైగా నమోదైన కోలుకున్నవారి సంఖ్య
చికిత్సలో ఉన్నవారికి 3.5 రెట్లు కోలుకున్నవారు
Posted On:
30 AUG 2020 2:08PM by PIB Hyderabad
కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నవారు, స్వల్పలక్షణాలతో ఇళ్ళలో ఏకాంతవాసంలో ఉండి కోవిడ్ నుంచి బైటపడుతున్నవారు ఎక్కువవుతూ ఉండటంతో ఇప్పటివరకు కోలుకునవారి మొత్తం సంఖ్య ఈ రోజు 27 లక్షలు దాటింది. దీంతో ఇప్పటివరకూ కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 27,13,933 కు చేరింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స ఆందించు అనే త్రిముఖ బ్వ్యాహాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. సకాలంలో నిఘా పెట్టటం ద్వారా బాధితులను గుర్తించి మెరుగైన మౌలిక సదుపాయాలతో వెంటనే చికిత్స అందించటం తగిన ఫలితాలనిచ్చింది.
గడిచిన 24 గంటల్లో 64,935 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం 76.61% గా మెరుగుదల నమోదు చేసుకుంది. పరిస్థితి అదే పనిగా మెరుగవుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి.గత కొద్ది నెలలుగా కరోనా పాజిటివ్ లలో ఎక్కువమంది కోలుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారొతో పోల్చుకున్నప్పుడు కోలుకున్నవారి సంఖ్య 3.55 రెట్లు ఎక్కువగా ఉంది.
భారత్ లో మొత్తం 19.5 లక్షలమంది ( కచ్చితంగా చెప్పాలంటే 19,48,631) ఇప్పటివరకు కోలుకున్నారు.ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 765302. అంటే వీళ్ళకంటే కోలుకున్నవారు మూడున్నర రెట్లు అధికం. ఈ విధంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య మొత్తం పాజిటివ్ కేసుల్లో తగ్గుతూ 21.60% వద్ద ఉండటం వల్ల బాధితుల భారం ప్రభుత్వం మీద బాగా తగ్గినట్టే కనిపిస్తోంది. దీనివలన బాధితులకో, కోలుకున్నవారికీ మధ్య అంతరం పెరుగుతోంది.
సకాలంలో బాధితులకు చికిత్స అందిస్తూ, అవసరమనిపిస్తే ప్రత్యేక వైద్యం అందిస్తూ మరణాల శాతాన్ని అదుపులో ఉంచటంలో కూడా రాష్ట్రాలు బాగా కృషి చేశాయి. అందువలన మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడది మరింత తగ్గి1.79% కు చేరాయి.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1649785)
Visitor Counter : 196