ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; మేజర్ ధ్యాన్ చంద్ కు ఆయన స్మృత్యంజలి ఘటించారు

Posted On: 29 AUG 2020 10:37AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే, భారతీయ హాకీ లో మహా దిగ్గజ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి స్మృత్యంజలి ని ఘటించారు.

‘‘వివిధ క్రీడల లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించినటువంటి మరియు మన దేశాని కి గౌరవాన్నందించి దేశం గర్వపడేటట్లు చేసినటువంటి అనుకరణ యోగ్యమైన క్రీడాకారులందరి అసాధారణ కార్యసాధన ల ను ఒక ఉత్సవం లాగా జరుపుకొనే రోజే ఈ జాతీయ క్రీడల దినం.  ఆయా క్రీడాకారుల గట్టి పట్టుదల, ఇంకా దృఢ సంకల్పం శ్రేష్ఠమైనవి.

ఈ రోజు న, జాతీయ క్రీడల దినం సందర్భం లో, మేజర్ ధ్యాన్ చంద్ కు మనం స్మృత్యంజలి ని సమర్పించుకొందాము.  మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టిక్ తో చేసిన ఇంద్రజాలం ఎన్నటికీ మరపురానిది.  
 
ఈ దినం మన ప్రతిభాన్విత క్రీడాకారుల సఫలత కోసం వారి కుటుంబ సభ్యులు, శిక్షకులు మరియు సహాయక సిబ్బంది అందించిన విశిష్టమైన ఊతాన్ని ప్రశంసించవలసినటువంటి దినం కూడాను.

భారతదేశం లో క్రీడల కు ప్రజాదరణ లభించేటట్లు చూసేందుకు మరియు క్రీడాకారుల ప్రతిభ కు సాయపడేందుకు అసంఖ్యాక ప్రయాసల కు భారత ప్రభుత్వం నడుం కట్టింది.  అదే కాలం లో, ఆటల ను మరియు ఫిట్ నెస్ సంబంధిత వ్యాయామాల ను నిత్య జీవనం లో చేపట్టే క్రమబద్ద చర్యల లో ఓ భాగం గా చేసుకోండి అంటూ ప్రతి ఒక్కరి ని నేను కోరుతున్నాను.  అలా చేసినందువల్ల, అనేక లాభాలు ఉంటాయి.  ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా, సంతోషం గా ఉందురుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

***



(Release ID: 1649526) Visitor Counter : 178