ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        పిఎం-జెడివై 6 సంవత్సరాల కాలాన్ని ఫలప్రదం గా పూర్తి చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 AUG 2020 11:03AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జన్ ధన్ యోజన కు 6 సంవత్సరాల కాలం ఫలప్రదం గా ముగిసిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.  పిఎం-జెడివై విజయవంతం అయ్యేందుకు అలుపెరగక పాటుపడ్డ వారందరిని కూడా ఆయన ప్రశంసించారు.
‘‘బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుకోని వారికి బ్యాంకింగ్ సేవల ను అందించాలన్న మహత్త్వాకాంక్ష తో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ఆరు సంవత్సరాల క్రితం, ఈ రోజు నే, ప్రారంభించడమైంది.  ఈ కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించేటటువంటి అనేక చొరవల కు ఆధారభూతం గా నిలచి కోట్ల కొద్దీ ప్రజల కు లబ్ధి ని అందిస్తూ, అంతవరకు ఉన్న వ్యవస్థ లో ఓ మార్పు ను తీసుకువచ్చింది.  
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సౌజన్యం తో అనేక కుటుంబాల భవిత కు భద్రత ఏర్పడింది.  ఈ పథకం లో ఎక్కువ భాగం లబ్ధిదారులు మహిళలు, ఇంకా గ్రామీణ ప్రాంతాల కు చెందినవారూను.  పిఎం-జెడివై ని ఒక సఫలమైనటువంటి కార్యక్రమం గా తీర్చిదిద్దడం కోసం అలసట ఎరుగకుండా శ్రమించిన వారందరిని కూడా ఈ సందర్భం లో ప్రశంసిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 
***
 
                
                
                
                
                
                (Release ID: 1649222)
                Visitor Counter : 257
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam