ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గడిచిన 24 గంటల్లో 9 లక్షల పరీక్షలు, ఇప్పటివరకు దాదాపు 3.9 కోట్ల పరీక్షలు
మరో మైలురాయి దాటిన భారత్ - మొత్తం కోలుకున్నవారు 25 లక్షలు
చికిత్సలో ఉన్నవారి కంటే కోలుకున్నవారు 18 లక్షలు అదనం
Posted On:
27 AUG 2020 1:58PM by PIB Hyderabad
పరీక్షించి, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే వ్యూహాత్మక వైఖరి కారణంగా భారత్ లో పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దీనివలమ ప్రాథమిక దశలోనే బాధితులను గుర్తించటం సాధ్యమవుతోంది. అలా గుర్తించగలగటం వలమ స్వల్ప లక్షణాలున్నవారిని ఐసొలేషన్ కు సూచించటం లేదా తీవ్ర లక్షణాలుంటే ఆస్పత్రులకు తరలించటం సులభమవుతోంది. తగిన చికిత్స అందించటానికి ఇది దోహదం చేస్తోంది.వీటన్నిటిఫలితంగా బాధితులు వేగంగా కోలుకోగలుగుతున్నారు. అదే సమయంలో మరణాల శాతం బాగా తగ్గిపోతూ వస్తోంది.
ఈ విధంగా దూకుడుఇగా పరీక్షల మీద దృష్టిపెట్టటం వలన ఇప్పటి వరకు దేశంలో జరిపిన పరీక్షల సంఖ్య ఈరోజు 3.9 కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లోనే 9,24,998 లక్షల శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 3,85,76,510 కు చేరింది.
రాను రాను ఎక్కువమంది బాధితులు కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, స్వల్ప లక్షణాలతో ఇళ్ళలోనే ఐసొలేషన్ లో ఉంటూ ఇప్పుడు బైటపడటమో జరుగుతున్నందున భారత్ లో మొత్తం కోలుకున్నవారి సంఖ్య ఈ రోజు 25 లక్షలు దాటింది. ఇలా మొత్తం 25,23,771 మంది కోలుకోవటానికి కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందిస్తున్న సహకారం కూడా ప్రధాన కారణం. గడిచిన 24 గంటల్లో 56,013 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఆ విధంగా కోలుకున్నవారి శాతం నేటికి 76.24% చేరింది.
భారత్ లో మొత్తం 7,25,991 మంది బాధితులు చికిత్సలో ఉండగా కోలుకున్నవారి సంఖ్య దాదాపు 18 లక్షలకు (17,97,780) చేరువైంది. ఈ విధంగా కోలుకుంటున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ఉంది. ప్రస్తుతం ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసులలో 21.93% గా నమోదైంది.
ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి చికిత్సా నియమావళికి అనుగుణంగా ప్రామాణిక చికిత్సా విధానాలు పాటిస్తూ ఉండటం వల్ల, ఐసియు ఆస్పత్రులలో నైపుణ్యమున్న డాక్టర్లు చికిత్స అందించటం వల్ల, ఆంబులెన్స్ సేవలు మరింత మెరుగ్గా ఉండటం వల్ల, సకాలంలో ఆక్సిజెన్ సేవలు అందుబాటులో ఉంచటం వల్ల జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాలు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం మరణాల శాతం 1.83% కు చేరింది. కోలుకోవటంలో జాతీయ సగటు కంటే 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తక్కువగా మరణాలు నమోదవటం కూడా గమనార్హం.
దేశవ్యాప్తంగా పరీక్షలకోసం అవసరమైన లాబ్ ల నెట్ వర్క్ విస్తరిస్తూ వస్తోంది. దీంతో మొత్తం లాబ్ ల సంఖ్య ప్రస్తుతం 1550 కి చేరింది. అందులో ప్రభుత్వం ఆధ్వర్యంలో 993, ప్రైవేటు రంగంలో 557 లాబ్ లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 795 (ప్రభుత్వ: 460 + ప్రైవేట్: 335)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 637(ప్రభుత్వ: 499 + ప్రైవేట్: 138)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 118 (ప్రభుత్వ: 34 + ప్రైవేట్84)
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1649004)
Visitor Counter : 269
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam