కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇఎస్ఐసి కి చెందిన అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన కింద అర్హత ప్రమాణాల సడలింపు, నిరుద్యోగ ప్రయోజనం పెంపు
24.3.2020 నుంచి 31.12.2020 వరకు గరిష్ఠంగా 90రోజుల నిరుద్యోగ కాలానికి 50 శాతం సగటు వేతనం ప్రస్తుతం చెల్లింపు, ఇంతకు ముందు ఇది 25 శాతంగా ఉండేది.
ఇ.ఎస్.ఐ ఆస్పత్రులలోనిమొత్తం బెడ్ల లో 10 శాతం ఐసియు, హెచ్.డి.యు సేవలకు కేటాయింపు
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇ.ఎస్.ఐ తీసుకున్న చర్యలను అభినందించిన ఇఎస్ఐ కార్పొరేషన్ సభ్యులు
Posted On:
21 AUG 2020 11:04AM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ (ఇంఛార్జి) మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన నిన్న ఇ.ఎస్.ఐ కార్పొరేషన్ 182 వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ సేవలు అందించే యంత్రాంగానికి సంబంధించి,కోవిడ్ మహమ్మారి ప్రభావానికి గురైన కార్మికులకు సహాయం అందించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు కింది విధంగా ఉన్నాయి.
ఇఎస్ఐసి అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజనను అమలు చేస్తున్నది. ఇ.ఎస్.ఐ పథకం వర్తించే కార్మికులకు దీనికింద, నిరుద్యోగ ప్రయోజనం కల్పిస్తారు. ఇ.ఎస్.ఐ కార్పొరేషన్ ఈ పథకాన్ని మరో ఏడాది వరకు అంటే 2021 జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఈ పథకం వాస్తవ అర్హతా నిబంధనలకు అనుగుణంగా 01.01.2021 నుంచి 30.06.2021 వరకు అందుబాటులో ఉంటుంది. 31.12.2020 తర్వాత అవసరాన్ని, డిమాండ్‌ను బట్టి సడలింపులపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
సహాయం పొందడానికి అర్హతా ప్రమాణాలను కూడా కింది విధంగా సడలించారు:
ఎ) గరిష్ఠంగా 90 రోజుల నిరుద్యోగానికి ఇంతకు ముందు 25 శాతం వేతనాలు చెల్లిస్తుండగా దానిని 50 శాతానికి పెంచారు.
బి) 90 రోజుల నిరుద్యోగం అనంతరం సహాయం చెల్లించడానికి బదులు, 30 రోజుల నిరుద్యోగం తర్వాత చెల్లించే విధంగా మార్చారు.
సి) బీమా కలిగిన వ్యక్తి క్లెయిమ్‌ను, చివరి ఎంప్లాయర్ ద్వారాఫార్వర్డు చేయడానికి బదులుగా, నేరుగా ఇ.ఎస్.ఐ.సి బ్రాంచ్ ఆఫీసుకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన చెల్లింపును ఇన్సూర్ అయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.
డి)ఇన్సూర్ అయిన వ్యక్తికి ఉపాధికి ముందు, ఇన్సూర్ చేయదగ్గ కనీస రెండు సంవత్సరాల ఉపాధి ఉండాలి. అలాగే నిరుద్యోగానికి ముందు కనీసం 78 రోజుల కంట్రిబ్యూషన్ కాలానికి కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. నిరుద్యోగానికి ముందు రెండు సంవత్సరాలలో మిగిలిన మూడు కంట్రిబ్యూషన్ పీరియడ్‌లలో కనీసం ఒక కంట్రిబ్యూషన్ కాలం 78 రోజులకు కంట్రిబ్యూట్ చేసి ఉండాలి.
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఇ.ఎస్.ఐ.సి ఆస్పత్రులలో ఐసియు, హెచ్ డి యు సేవలను బలోపేతం చేసేందుకు ఇ.ఎస్.ఐ.సి ఆస్పత్రులలో పది శాతం బెడ్లను, ఐసియు, హెచ్‌డియు సేవలకు కేటాయించాలని నిర్ణయించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం సంస్థ స్టేక్‌హోల్డర్లపై పడకుండా చూసేందుకు , సాధారణ ప్రజలకు వైద్య సదుపాయాలకు సంబంధించి మౌలికసదుపాయాలను కల్పించేందుకు ఇ.ఎస్.ఐ.సి తీసుకున్న చర్యలను ఇ.ఎస్.ఐ కార్పొరేషన్ సభ్యులు ఈ సమావేశంలో అభినందించారు.
దేశవ్యాప్తంగా 23 ఇఎస్‌సిఐ ఆస్పత్రులు 2600 ఐసొలేషన్ బెడ్లు, సుమారు 1350 క్వారంటైన్ బెడ్లతో కోవిడ్ వైద్యసదుపాయాలను సాధారణ ప్రజలకు అందించేందుకు ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులుగా ఆయా ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
వీటికితోడు,దేశవ్యాప్తంగా మిగిలిన ఇఎస్ఐసి ఆస్పత్రులలో 961 కోవడ్ ఐసొలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. దీనితో వివిధ ఇఎస్ఐసి ఆస్పత్రులలో మొత్తం 3597 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు మొత్తం 555 ఐసియు, హెచ్‌డియు బెడ్లు, 213 వెంటిలేటర్లు ఈ ఆస్పత్రులలో అందుబాటులో ఉండేట్టు చూశారు.
బి. ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ ఆస్పత్రులైన ఫరీదాబాద్(హర్యానా), సనత్ నగర్ (తెలంగాణా), గుల్బర్గా (కర్ణాటక), ఇఎస్ఐసి పిజిఐఎంఎస్ఆర్ , బసాయిదార్‌పూర్ (ఢిల్లీ0, లు ఐసిఎంఆర్ ఆమోదిత కోవిడ్ -19 ల్యాబ్‌టెస్ట్ సేవలుతమ వద్దనే ప్రారంభించాయి.
సి. ఫరీదాబాద్ (హర్యానా), సనత్ నగర్ (తెలంగాణా)లలోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజీలలో ప్లాస్మా థెరపీ చికిత్స సదుపాయం కల్పించారు.
డి. ర్యాపిడ్ కోవిడ్ -18 యాంటిజెన్ టెస్ట్ నుకూడా ఢిల్లీ,ఎన్.సి.ఆర్ రీజియన్ లోని అన్ని ప్రధాన ఇఎస్ఐసి ఆస్పత్రులలో ప్రారంభించారు.
ఇ. కోవిడ్ కాకుండా ఇతర వైద్య సేవలను బీమా కలిగినవారు, వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు టై-అప్ ఆస్పత్రులతో కలిసి ప్రత్యామ్నాయేర్పాట్లు చేయడం జరిగింది.
పై అంశాలతో పాటు,ఇఎస్ఐసి బీమా కలిగిన వ్యక్తులకు, వారిలబ్ధిదారులకు సంబంధించి 30 ఇతర అజెండా,రిపోర్టింగ్ ఐటమ్‌లకు సంబంధించి సేవలు , ప్రయోజనాల మెరుగుదల, ఇతర పాలనా పరమైన అంశాలను సమావేశంలో చర్చించి , ఆమోదించారు.
కార్పొరేషన్ కు చెందిన 60 మంది సభ్యులు, ఎంప్లాయర్స్ ప్రతినిధులు, ఎంప్లాయీ ప్రతినిదులు, వృత్తి నిపుణులు, రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి శ్రీ హీరాలాల్ సమారియా, పార్లమెంటు సభ్యులు శ్రీ రాక్ కృపాల్ యాదవ్, పార్లమెంటు సభ్యులు శ్రీమతి డోలా సేన్, డైరక్టర్ జనరల్ శ్రీమతి అనూరాధా ప్రసాద్, కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఎ.ఎస్.ఎఫ్.ఎ శ్రీమతి శివాని స్వైన్ ఉన్నారు.
******
(Release ID: 1647609)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam