ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పెద్ద సంఖ్యలో కోలుకుంటున్న కోవిడ్ బాధితులు ఇప్పుడు మొత్తం సంఖ్య దాదాపు 21 లక్షలు

కోలుకుంటున్నవారి శాతం నేటికి 74%

చికిత్సలో ఉన్నవారి కంటే కోలుకున్నవారు 3 రెట్లు అధికం

Posted On: 20 AUG 2020 3:01PM by PIB Hyderabad

కోవిడ్ నుంచి కోలుకొని ఆస్పత్రులనుంచి, హోమ్ ఐసొలేషన్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య ఈరోజు దాదాపు 21 లక్షలకు చేరింది. 20,96,664 మంది కోలుకోవటానికి ప్రధాన కారణం పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం సమర్థంగా అనుసరించటమే. ఆక్సిజెన్ వాడకం, నైపుణ్యం గల డాక్టర్లను ఐసియు లలో నియోగించటం, మెరుగైన ఆంబులెన్స్ ల వాడకం సహా చికిత్సకు సంబంధించి ప్రామాణిక విధానాలు పాటించటం వలన ఆశించిన ఫలితాలు రాబట్టగలిగారు. 


గడిచిన 24 గంటల్లో 58,794  మంది కోలుకోగా భారత్ లో కోలుకుంటున్నవారి శాతం 74% (73.91%) కు చేరింది. గత కొద్ది నెలలలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నదనటానికి ఇది నిదర్శనం.
భారత్ లో మొత్తం 14 లక్షల (14,10,269) మంది కోలుకోగా వీరి సంఖ్య ప్రస్తుతం చికిత్సలో ఉన్న వారు 6,86,395 మంది కంటే చాలా ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో కోలుకుంటున్నవారు ఉండటంతో ఇప్పుడు దేశంలో చికిత్స అందించాల్సినవారి  సంఖ్య బాగా తగ్గి అదుపులో ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్య మొత్తం పాజిటివ్ కేసులలో 24.19%  మాత్రమే. 
తొలిదశలోనే పరీక్షలు చేసి గుర్తించటం, బాధితుడికి దగ్గరగా వచ్చినవారి ఆనవాలు పట్టటం, పాజిటివ్ గా గుర్తించిన వారికి సకాలంలో చికిత్స అందించటం కారణంగా కోలుకునేవారి సంఖ్య పెరగటంతోబాటు పాజిటివ్ లలో చనిపోయినవారి సంఖ్య బాగా తక్కువగా ఉంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటంతోబాటు క్రమంగా ఇంకా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1.89% గా ఉంది. అంతే కాకుండా చికిత్సలో ఉన్నవారిలో వెంటిలేటర్ సాయంతో ఉన్నవారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

 

Image


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం చూడండి:  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
 

****


(Release ID: 1647441) Visitor Counter : 271