ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పరీక్షలలో దూసుకెళుతున్న భారత్: వరుసగా రెండో రోజూ 8 లక్షలు దాటిన పరీక్షలు

ప్రతి పదిలక్షలమందికీ పెరిగిన పరీక్షలు, ప్రస్తుతం 23,002, పాజిటివ్ కేసులు స్థిరంగా 8%

Posted On: 19 AUG 2020 4:33PM by PIB Hyderabad

"పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే త్రిముఖ వ్యూహం మీద దృష్టి సారిస్తూ భారత్ వరుసగా రెండో రోజు కూడా 8 లక్షలకు పైబడి కోవిడ్ పరీక్షలు చేసింది. రోజువారీ పరీక్షల సంఖ్య పది లక్షలకు చేరాలన్న పట్టుదలతో ప్రస్తుతం గత 24  గంటల్లో 8,01,518 పరీక్షలు చేసింది. ఇప్పటివరకూ జరిపిన మొత్తం పరీక్షలు 3,17,42,782 కు చేరాయి. ప్రతి పది లక్షల్లో చేసిన పరీక్షల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పదిలక్షల్లొ పరీక్షలు 23,002 గా నమోదయ్యాయి. 


ఇదంతా దూకుడుగా పరీక్షల సంఖ్య పెంచటం వల్లనే సాధ్యమైంది. సకాలంలో పాజిటివ్ కేసుల గుర్తింపు, వాళ్లకు దగ్గరగా వచ్చినవారి ఆనవాళ్ళు గుర్తించి వేరు చేయటం, సరైన చికిత్స అందించటం ఈ తరహా పరీక్షల వేగవంతం వల్లనే సాధ్యమైంది. అందుకే పరీక్షల సంఖ్య పెంచటం వలన భారత్ లో కోలుకుంటున్నవారి సంఖ్య పెంచటానికి కూడా వీలు కలిగింది. ఆ విధంగా చికిత్సలో ఉన్నవారికీ, కోలుకుంటున్నవారికీ మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. అదే విధంగా మరణాలశాతం కూడా తగ్గుతోంది.

 


పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో  ప్రస్తుతం లాబ్ ల సంఖ్య  1486 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 975 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 511 ఉన్నాయి.


రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి: 


తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  762 (ప్రభుత్వ:  452   + ప్రైవేట్:  310)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 607 (ప్రభుత్వ: 489+ ప్రైవేట్: 118)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117 (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 83 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***


(Release ID: 1647004) Visitor Counter : 227