ఉక్కు మంత్రిత్వ శాఖ

వలస కార్మికులకు తక్కువ వ్యయం ఇళ్ల నిర్మాణం కల్పించడం లో భాగస్వాములు కావలసిందిగా ఉక్కు పరిశ్రమను కోరిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

దేశంలోని ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో, హుందాగా జీవించడానికి అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్

Posted On: 18 AUG 2020 2:25PM by PIB Hyderabad

వలస కార్మికులకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం కల్పించడం లో భాగస్వాములు కావలసిందిగా ఉక్కు పరిశ్రమ దిగ్గజలను కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వాయువు ల శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణం, విమాన యాన రంగంలో ఉక్కు అవసరాలు: ఆత్మ నిర్భర భారత్ అనే అంశంపై ఈ రోజు  జరిగిన వెబినర్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ ప్రాంతాల ఇళ్ల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, పరిశ్రమ మరెన్నో ఉక్కు-అవసరాలతో కూడిన తక్కువ ఖర్చు ఇళ్లను నిర్మించాలని, ఇది ఇతరులు అనుకరించడానికి నమూనాగా ఉంటుందని ఆయన అన్నారు. ఇటువంటి సంక్షేమ పథకాల లో పరిశ్రమ భాగస్వామ్యం కావాలని, పౌరులు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించాలని ఆత్మనిర్భర భారత్ కోరుకుంటుందని ఆయన అన్నారు. 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) తో కలిసి ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ వెబినార్ ను నిర్వహించింది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (హెచ్‌యుఎ), పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) శ్రీ హర్దీప్ సింగ్ పూరి. ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్థి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. స్టీల్, హెచ్‌యుఎ,  సివిల్ ఏవియేషన్ విభాగాల కార్యదర్శులు, ఈ విభాగాల సీనియర్ అధికారులు పిఎస్‌యులు, పరిశ్రమ దిగ్గజాలు, సిఐఐ వెబినార్‌లో పాల్గొన్నారు. 

 

 

 

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు చేపట్టే అతి భారీ ప్రాజెక్టులు, వాటి భవిష్యత్ ప్రణాళికలు ఉక్కు పరిశ్రమ తమ భాగస్వామ్యనికి ప్రేరణ కావాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశం పురోగతి మార్గంలో ముందుకు సాగడం వల్ల దేశంలో ఉక్కు వాడకాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. సమగ్ర ప్రపంచ-ప్రామాణిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చిన ప్రధానమంత్రి ఇటీవలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ,  రెడ్-టాపిజం నుండి విముక్తి పొందడం ద్వారా ప్రాజెక్టులను త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు

కోవిడ్ సంక్షోభం సమయంలో, భారత పరిశ్రమ పిపిఇ కిట్లు, మాస్క్‌లు, వెంటిలేటర్లను పెద్ద సంఖ్యలో తయారు చేసిందని, భారతీయ ఫార్మా పరిశ్రమ 150 దేశాలకు మందులు సరఫరా చేసిందని శ్రీ ప్రధాన్ చెప్పారు. ఇదే తరహాలో, ఇప్పటికే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ఉక్కు అవసరాలకు ఇష్టపడే వనరుగా అవతరించాలి. దేశంలో మంచి-నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులకు కొరత లేదని, దేశీయంగా ఉత్పత్తి చేసే ఉక్కుకు ప్రాధాన్యత ఇవ్వడం పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా మారడానికి దోహదపడుతుందని అన్నారు. తక్కువ ఖర్చుతో, సరసమైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ, ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచడం, విలువలు చేర్పులు చేయడం , మిషన్ మోడ్‌లో చేపట్టే కార్యకలాపాలు అవసరమని మంత్రి అన్నారు. ఉక్కు వినియోగాన్ని పెంచడానికి విధాన చట్రాన్ని మరింత మెరుగుపరచడానికి సూచనలు చేయగల వివిధ విభాగాలు, పరిశ్రమ సంఘాలు, విద్యావేత్తలతో కూడిన వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని శ్రీ ప్రధాన్ పిలుపునిచ్చారు.

వెబినార్‌ను ఉద్దేశించి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్థి మాట్లాడుతూ  దేశంలో ఉక్కు వినియోగాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వ కీలకమైన స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్, ఉడాన్ దేశంలో ఉక్కు వినియోగానికి ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. ఉక్కు వాడకం దేశ పురోగతికి సూచిక. ప్రపంచ సగటుతో పోలిస్తే మూడింట ఒక వంతు ఉక్కు వినియోగం ఉన్న భారతదేశం, దాని వినియోగాన్ని పెంచే పెద్ద పరిధిని కలిగి ఉంది అని తెలిపారు.

 కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలని, తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలు, పోటీ ధరలకు ఉక్కును అందుబాటులో ఉంచాలని, దాని వినియోగాన్ని ప్రచారం చేయాలని శ్రీ పూరి పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి, పౌర విమానయాన రంగాల నుండి ఏర్పడిన డిమాండ్ ద్వారా భవిష్యత్తులో 300 ఎంఎమ్‌టిపిఎ ఉత్పత్తి సామర్థ్యం గురించి స్టీల్ మంత్రిత్వ శాఖకు బలంగా మద్దతు ఉంటుందని శ్రీ పురి చెప్పారు. 

****



(Release ID: 1646772) Visitor Counter : 164