ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో ఒకరోజులో గరిష్ఠంగా కోలుకున్నవారి సంఖ్య 57,584
72%వైపు దూసుకెళుతున్న కోలుకున్నవారిశాతం
20 లక్షలు దాటనున్న మొత్తం కోలుకున్నవారి సంఖ్య
Posted On:
17 AUG 2020 1:46PM by PIB Hyderabad
కోవిడ్ కోలుకున్నవారి సంఖ్య బాగా భారత్ లో రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఈ రోజు దేశంలో అత్యధిక సంఖ్యలో 57,584 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో వీళ్ళంతా ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, ఐసొలేషన్ నుంచి బైటికి రావటమో జరిగింది.
దీంతో భారత్ లో కోలుకున్నవారి శాతం 72% మైలురాయిని దాటటానికి సిద్ధమవుతోంది. నివారణ చర్యలను సమన్వయంతో సమర్థంగా వేగవంతం చేయటం, దూకుడుగా, సమగ్రంగా పరీక్షలు జరపటం, ప్రామాణీకరించిన చికిత్సా విధానాలు పాటించటం, వ్యాధి తీవ్రత ఆధారంగా వర్గీకరించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన చికిత్స అందించటం తగిన ఫలితాలనిచ్చింది.
ఇలా రోజురోజుకూ ఎక్కువమంది బాధితులు కోలుకొని ఆస్పత్రులనుంచి, ఐసొలేషన్ నుంచి బైటికి వస్తూ ఉండటంతో భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య దాదాపుగా 20 లక్షలకు (కచ్చితంగా చెప్పాలంటే 19,19,842) చేరువవుతూ వస్తోంది. దీనివలన బాధితులకూ, కోలుకున్నవారికీ మధ్య తేడా పెరుగుతూ నేటికి అది 12,42,942 కు చేరింది.
దేశం మీద బాధితుల భారం అలా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,76,900 కు చేరింది. అంటే పాజిటివ్ గా నమోదైనవారిలో ఇంకా చికిత్సలో ఉన్నవారు 25.57% మాత్రమే ఉన్నారు. తొలిదశలోనే గుర్తించి స్వల్ప లక్షణాలున్నవారిని ఐసొలేషన్ లో ఉంచటం, ఒకమోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్నవారిని ఆస్పత్రులకు తరలించటం కారణంగా సమర్థంగా చికిత్స అందించే వీలు కలిగింది. ఈరోజుకు పాజిటివ్ కేసులలో మరణించినవారి శాతం 1.92 దగ్గర నిలచింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1646443)
Visitor Counter : 255
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam