ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్ ప్రధానమంత్రితో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 AUG 2020 2:33PM by PIB Hyderabad
నేపాల్ ప్రధానమంత్రి శ్రీ కె.పి.శర్మ ఓలి నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం టెలిఫోన్ కాల్ అందుకున్నారు.
భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి, భారత ప్రజలకు నేపాల్ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే ఇటీవలి ఎన్నికల్లో ఐక్యరాజ్య సమితి నాన్ పెర్మనెంట్ సభ్యత్వానికి ఎన్నికైనందుకు భారతదేశానికి ఆయన శుభాకాంక్షలు అందచేశారు.
కోవిడ్-19ని అదుపులోకి తేవడానికి పరస్పరం సంఘీభావపూర్వకంగా సహకరించుకోవాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఈ విషయంలో నేపాల్ కు భారతదేశం నిరంతర మద్దతు కొనసాగిస్తుందని నేపాల్ కు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
టెలిఫోన్ కాల్ చేసినందుకు నేపాల్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియచేసిన ప్రధానమంత్రి భారత, నేపాల్ దేశాల మధ్య నాగరిక, సాంస్కృతిక అనుసంధానత ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
***
(रिलीज़ आईडी: 1646099)
आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam