ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో అత్యధికంగా ఒకేరోజు కోలుకున్నవారు 56,383 మంది

ఇప్పటిదాకా కోలుకున్నవారు 17 లక్షల మంది పాజిటివ్ లలో మరణాల సంఖ్య 1.96% కు చేరిక

Posted On: 13 AUG 2020 2:44PM by PIB Hyderabad

భారతదేశం కోవిడ్ చికిత్సలో మరో ఘనత సాధించింది. ఒకే రోజులో 56,383  మంది కోవిడ్ బాధితులు  కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు సుమారు 17 లక్షలమంది దాకా ( కచ్చితంగా చెప్పాలంటే 16,95,982 మంది) కోలుకున్నట్టయింది.


కేంద్రంతో  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి సమర్థవంతమైన నిరోధక చర్యలు, సమగ్రంగా పరీక్షల సంఖ్య బాగా పెంచటం, ప్రామాణికమైన చికిత్సా పద్ధతులు  విజయవంతంగా అమలు చేయటం వల్ల తగిన ఫలితాలు వస్తున్నాయి. "దూకుడుగా పరీక్షించటం,  సమగ్రంగా ఆనవాలు పట్టటం, సమర్థవంతమైన చికిత్స అందించటం  " అనే త్రిముఖ వ్యూహం  ఆశించిన ఫలితాలనిస్తోంది.  ఒకమోస్తరు లక్షణాలతో ఇళ్ళ దగ్గర ఐసొలేషన్ లో ఉన్నవాళ్ళను కూడా ప్ర్తామాణిక చికిత్సా విధానాలకు అనుగుణంగా పర్యవేక్షిస్తూ చికిత్స అందించటం, తీవ్ర లక్షణాల తీవ్రత ఉన్నవాళ్ళను ఆస్పత్రులలో చేర్చి చికిత్స చేయటం కూడా కోలుకున్నవారి శాతం ఎక్కువగా ఉండటానికి కారణాలు. కోలుకున్మవారి శాతం 70% దాటటానికి ( ఈ రోజు 70.77% ), మరణాల శాతం బాగా తగ్గుతూ 1.96 శాతానికి పడిపోవటానికి ఇదే కారణం.  

రికార్డ్ స్థాయిలో కోలుకుంటూ ఉండటంతో దేశంలో పాజిటివ్ ల చికిత్స భారం తగ్గుతూ వస్తోంది. మొత్తం పాజిటివ్ గా నమోదైన వారిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి శాతం 27.27% మాత్రమే ఉంది.  చికిత్సలో ఉన్న 6,53,622 మందితో పోల్చినప్పుడు కోలుకున్నవారి సంఖ్య 10 లక్షలకు పైగా ఎక్కువగా ఉంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా  https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే  technicalquery.covid19[at]gov[dot]in కు  పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf



 

****


(Release ID: 1645489) Visitor Counter : 258