ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చరిత్రాత్మక స్థాయిలో 15 లక్షలు దాటిన కోలుకున్నవారు

నేడు ఒక్కరోజులోనే అత్యధికంగా 54,859 మంది

చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 9 లక్షలు అధికం

తాజాగా పాజిటివ్ కేసుల్లో మరణాలు 2 శాతానికి తగ్గుదల

Posted On: 10 AUG 2020 11:52AM by PIB Hyderabad

భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య చరిత్రాత్మకంగా ఈరోజు 15 లక్షలు దాటింది. పరీక్షలు దూకుడుగా చేపట్టటం, సమగ్రంగా ఆనవాళ్ళు పట్టటం, సమర్థంగా చికిత్స అందించటం  కారణంగా ఇప్పటిదాకా 15,35,743 మంది బాధితులు కోలుకోగలిగారు. మెరుగైన ఆంబులెన్స్ సౌకర్యాలు, ప్రామాణిక చికిత్సావిధానాలమీద దృష్టి సారించటం, ఆక్సిజెన్ సరఫరా విధానం వాడకం ఈ సత్ఫలితాలకు కారణాలయ్యాయి.

గడిచిన 24  గంటల్లో నమోదైన ఒకేరోజు కోలుకున్నవారి సంఖ్య 54,859 కు చేరగా కోవిడ్ బాధితులలో కోలుకున్నవారి శాతం గరిష్ఠంగా దాదాపు 70% అయింది.

రికార్డు స్థాయిలో కోలుకున్నవారి సంఖ్య నమోదవుతూ ఉండగా ఇప్పటికీ ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో వీరి శాతం ప్రస్తుతం 28.66% మాత్రమే ఉంది. ఆ విధంగా చికిత్సలో ఉన్న 6,34,945 మందికంటే 9 లక్షలమంది ఎక్కువగా కోలుకున్నవారు ఉన్నారు.

పరీక్షలు జరపటం మీద దృష్టి సారిస్తూ, కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ఉమ్మడి కృషి ఫలితంగానూ, ఆస్పత్రులలో అందిస్తున్న మెరుగైన చికిత్స కారణంగాను మరణాల సంఖ్య బాగా తగ్గుతూ వస్తుంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాల శాతం ప్రస్తుతం 2 శాతానికి పరిమితమైంది. పైగా, ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముందుగానే పాజిటివ్ కేసులను గుర్తించటం వలన ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది.

 


త్వరగా గుర్తించటం వలన కొద్దిపాటి లక్షణాలు కనబరుస్తున్నవారిని సకాలంలో వారిని ఐసొలేషన్ కు పంపటం, ఒక మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలు కనబరుస్తున్నవారిని ఆస్పత్రులకు తరలించటం లాంటి పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఆ విధంగా అవసరమైన చికిత్స సమర్థంగా అందించటానికి వీలవుతోంది.

అయితే ఇప్పటికీ10 రాష్ట్రాలలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రభావ ఎక్కువగానే ఉంది. కొత్త పాజిటివ్ కేసుల్లో 80% ఆ రాష్ట్రాలలోనే నమోదవుతున్నాయి.  ఇంటింటి సర్వే ద్వారా దూకుడుగా పరీక్షలు జరపటం వలన మొదట్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, వ్యాధి నియంత్రణ దిశలో ఈ ప్రాంతాల్లో అనుసరిస్తున్న వ్యూహాలు క్రమంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***


(Release ID: 1644802) Visitor Counter : 264