ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో ఒకరోజులో 7,19,364 పరీక్షలతో సరికొత్త రికార్డు

ఇప్పటికి మొత్తం పరీక్షలు 2,41,06,535

Posted On: 09 AUG 2020 3:16PM by PIB Hyderabad

భారత్ లో పరీక్షల స్థాయి గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో 7 లక్షలు దాటటంతో సరికొత్త రికార్డు తయారైంది. వరుసగా ఆరు రోజులపాటు ఆరేసి లక్షలకు పైగా పరీక్షలు చేస్తూ రికార్డులు నెలకొల్పుతూ ఉండగా ఒక్కసారిగా ఇప్పుడు అన్ని రికార్డులను తిరగరాస్తూ గడిచిన 24 గంటల్లో 7,19,364  శాంపిల్స్ పరీక్షించారు.

ఆ విధంగా పరీక్షల సంఖ్య అంత ఎక్కువగా పెరగటంతో రోజువారీ నమోదయ్యే పాజిటివ్ కెసుల సంఖ్య కూడా పెరిగింది. అయితే, వైరస్ సోకే అవకాశమున్నవారి సమగ్రంగా ఆనవాలు పట్టుకుంటూ, సకాలంలో ఐసొలేషన్ కు పంపుతూ సమర్థమైన చికిత్స అందించాల్సిందిగా రాష్ట్రాలన్నిటికీ కేంద్రం విజ్ఞప్తి చేసింది. పరీక్షించు, ఆనవాలు గుర్తించు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యాహానికి అనుగుణంగా నడుచుకోవాలని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నవిధంగానే కేంద్రం అందుకు తగిన వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. గడిచిన వారంరోజుల్లో ఎక్కువ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాలతో అనేక సమావేశాలు జరిపి మార్గదర్శనం చేస్తూ వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి ఫలితాలనివ్వటం మొదలుపెట్టటంతో కోలుకున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే భారత్ లో కోలుకున్న కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 53,879 కి చేరింది. నిన్న ఒకేరోజు వీళ్ళంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 14,80,884 కు చేరింది. ఫలితంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య నేటికి 6,28,747 గా నిలిచింది. అలా చూసినప్పుడు చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 2.36 రెట్లు ఎక్కువగా ఉన్నారు. చికిత్సలో ఉన్నవారిలో కొంతమంది ఆస్పత్రులలోను, మరికొందరు ఇళ్లలోనే ఐసొలేషన్ లోను ఉన్నారు.

Description: C:\Users\Admin\Downloads\WhatsApp Image 2020-08-09 at 2.16.52 AM.jpeg


కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతోబాటు కోలుకుంటున్న వేగం పెరిగుతూ వస్తోంది.  నేటికి అది 68.78% చేరింది. చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతోంది. ఎక్కువమంది కోలుకుంటున్నారనటానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం కోలుకున్నవారి సంఖ్య 8,52,137 గా నమోదైంది.

కేంద్రంతోబాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో చేస్తున్న కృషి, తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలివ్వటానికి నిదర్శనమే కోలుకుంటున్నవాళ్ళు ఎక్కువగా ఉండటం. అదే సమయంలో ప్రభుత్వం వైద్య చికిత్స  పట్ల, మౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వస్తోంది. నిర్ణీత విధానాలు అమలు చేస్తూ నాణ్యమైన వైద్య సేవలందిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా పాజిటివ్ కేసుల్లో మరణించిన వారిశాతం బాగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడది 2.01% ఉంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే  technicalquery.covid19[at]gov[dot]in  కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****


(Release ID: 1644592) Visitor Counter : 258