విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఈ ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి సాధించిన ఎన్టీపీసీ గ్రూపు
Posted On:
08 AUG 2020 1:09PM by PIB Hyderabad
ఎన్టీపీసీ లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో, ఎన్టీపీసీ గ్రూపు సంస్థలన్నీ కలిసి 100 బిలియన్ యూనిట్ల (బీయూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించాయి.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ప్రచురించిన సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌టీపీసీ కోర్బా (2600 మెగావాట్లు) భారతదేశంలోనే అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంటుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్లాంటు, ఏప్రిల్-జులై మధ్య మొత్తం 97.42 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించింది.
ఎన్టీపీసీకి చెందిన మరో ఐదు ప్లాట్లు కూడా అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్టీపీసీ సీపత్ (2980 మెగావాట్లు), ఉత్తరప్రదేశ్‌లోని ఎన్టీపీసీ రిహాంద్ (3000 మెగావాట్లు), ఎన్టీపీసీ వింధ్యాచల్ (4760 మెగావాట్లు), ఒడిశాలోని ఎన్టీపీసీ తాల్చేర్ కనిహ (3000 మెగావాట్లు), ఎన్టీపీసీ తాల్చేర్ థర్మల్ (460 మెగావాట్లు) బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని తొలి పది స్థానాల్లో నిలిచాయి. వాటి పీఎల్‌ఎఫ్ ఆధారంగా ఈ లెక్కలు కట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఎన్టీపీసీ సింగ్రౌలికి చెందిన, 200 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటైన యూనిట్ 4, యూనిట్ 1 (1984 జనవరి, 1982 జూన్‌లో వీటిని ఏర్పాటు చేశారు) అత్యధికంగా వరుసగా 99.90 శాతం, 99.87 శాతం పీఎల్‌ఎఫ్ సాధించాయి. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య ఇది సాధ్యమైంది. విద్యుత్ ప్లాంట్ల కార్యాచరణ, నిర్వహణలో ఎన్టీపీసీ నైపుణ్యానికి, అత్యుత్తమ కార్యాచరణ సమర్థతకు ఇది నిదర్శనం.
ఎన్‌టీపీసీ వ్యవస్థాగత సామర్థ్యం 62.9 గిగావాట్లు. ఈ గ్రూపులో 24 బొగ్గు, 7 గ్యాస్/లిక్విడ్, ఒక జల విద్యుత్ కేంద్రం, 13 పునరుత్పాదక, 25 అనుబంధ, 7 జేవీ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. 5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు సహా, 20 గిగావాట్లకు పైగా సామర్థ్యమున్న ప్లాంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
***
(Release ID: 1644397)
Visitor Counter : 231