జౌళి మంత్రిత్వ శాఖ

6వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర జౌళి మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ

ఈ సందర్భంగా చేనేత పథకాల కోసం బ్యాక్ ఎండ్ వెబ్సైట్ మరియు మొబైల్ ఆప్లికేషన్తో తోపాటు మై హాండ్లూమ్ పోర్టల్, వర్చువల్ ఇండియన్ టెక్స్టైల్ సోర్సింగ్ ఫెయిర్ 2020 ప్రారంభించారు. దీనితోపాటు కులులోని చేనేత నైపుణ్య గ్రామాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు

చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం రెండువారాలపాటు #వోకల్ ఫర్ హాండ్ మేడ్ అనే హాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

Posted On: 07 AUG 2020 4:17PM by PIB Hyderabad

6వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు  శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర జౌళి శాఖ, భారత ప్రభుత్వం వారు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుటకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితం 1905లో జరిగిన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిగా  అగష్టు 7 తేదీని 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాట్నమే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  వర్చువల్  మాధ్యమం ద్వారా హిమాచల్ ప్రదేశ్ కంగ్రా నుండి ముఖ్య మంత్రి శ్రీ జైరాం ఠాకూర్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులకు అధికారిక గుర్తింపు కల్పించేందుకు ముంబైలోని టెక్స్టైల్ కమిటీ అభివృద్ధి చేసిన పూర్తి డిజిటలైజ్ చేసిన బ్యాక్ ఎండ్ వెబ్సైట్ మరియు మొబైల్ ఆప్ ను శ్రీమతి స్మృతి ఇరానీ  ప్రారంభించారు. దేశం నలుమూలల్లోని చేనేత కార్మికులకు వారి వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా  ఈ ఆప్  ఆంగ్లంతోపాటు మరియు మరో 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతీ చేనేత ఉత్పత్తి పైన ఉండే ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ద్వారా ఉత్పత్తి యొక్క సహజత్వాన్ని మరియు స్వచ్ఛతను తెలుసుకొనవచ్చును.

 

చేనేత ఉత్పత్తుల మార్కెటింగుకు, బ్లాక్ స్థాయి సమూహాల  వంటి చేనేత పథకాల లబ్ది పొందుటకు మరియు అవార్డుల గురించి తెలుసుకునేందుకు చేనేతకారుల వ్యక్తిగత లబ్దికోసం మై హాండ్లూం పోర్టల్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. మొదటి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2015లో  ఇండియా హాండ్లూం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీమతి స్మృతి ఇరానీ  ప్రారంభించారు. ఈ బ్రాండ్ క్రింద ఇప్పటివరకు  1590 ఉత్పత్తులు నమోదు కాగా ఇందులో 180 ఉత్పత్తి వర్గాలు ఉన్నాయి. ఈ పోర్టల్లో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం క్రింద  చేనేత పథకాలకు సంబంధించి వివిధ వివరాలను పారదర్శకతతో సంరక్షిస్తూ కార్మికుల వివరాలను ముద్రా లోన్ పథకం, చేనేత బీమా, నూలు సరఫరా, మగ్గాల మరియు ఇతర ఉపకరణాల  సరఫరా, శిక్షణ వంటివాటికి వినియోగించబడుతుంది.  వివిధ కార్యక్రమాల్లో స్టాళ్ళ నిర్వహణకు ఈ పోర్టల్లో ఆన్లైన్ లాటరీ పద్దతిలో అవకాశం కల్పించబడుతుంది. ఈ చేనేత పోర్టల్ ఇ-ఆఫీస్ మరియు డిబిటి పోర్టళ్ళకు లింకు చేయబడుతుంది.

విశ్వ మహమ్మారి కోవిడ్-19 కారణంగా ఎగ్జిబిషన్లు, మేళాలు వంటవి నిర్వహించకపోతుండడం వలన చేనేత కార్మికులకు ఆన్లైన్ మార్కెటింగ్ అవకాశాలను కల్పించడానికి ’ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో ఇండియన్ టెక్స్టైల్ సోర్సింగ్ ఫెయిర్ 2020న  ప్రారంభించారు. ఇందులో భాగంగా హాండ్లూం ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వారు  వర్చువల్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ ఫెయిర్ ఆగష్టు 7,10 మరియు 11 తేదీల్లో తెరచి ఉంటుంది, కాగా ఇందులో  దేశం నలుమూలల నుండి 150 మందికి పైగా పాల్గొంటున్నారు .ఇది ఇప్పటికే అంతర్జాతీయ బయ్యర్లను ఆకర్షించింది.  

కులు జిల్లా పరిపాలన వారి భాగస్వామ్యతో చేనేత నైపుణ్య గ్రామం కులు గురించిన ప్రదర్శన జరింగింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ జైరాం ఠాకూర్ హిమచల్ ప్రదేశ్ చేనేత ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శించే అవకాశం కలిగినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసారు. హిమాచల్  చేనేత ఉత్పత్తులు సాంప్రదాయక మరియు ప్రాచీన వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తద్వారా ప్రతీ జిల్లా తమ ప్రత్యేకతను చాటుకోవడానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.

చేనేత కార్మికుల పనితనాన్ని దేశ పౌరులకు మరింతగా గర్వపడే విధంగా తెలియపరచేందుకు సామాజిక మాధ్యమాల్లో రెండు వారాల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు  కేంద్ర మంత్రులు,లెఫ్టినెంట్ గవర్నర్లు, గవర్నర్లు,  రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  పార్లమెంట్ సభ్యులు మరియు పారిశ్రామికవేత్తు తమ తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ప్రయత్నించవలసిందిగా వారిని శ్రీమతి స్మృతి ఇరానీ అభ్యర్థించారు.

 అదే విధంగా భారత ప్రభుత్వ వివిధ శాఖల కార్యదర్శులు మరియు ఆ స్థాయి అధికారులను తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిందిగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కోరింది. వీరితో పాటు అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్ళు,  కేంద్ర సిల్క్ బోర్డు, జాతీయ జ్యూట్ బోర్డు వంటి ఇతర సహ సంస్థలను మరియు ఇతర సంబంధిత విభాగాల వారిని, మీడియా సంస్థలు, సామాన్ వ్యక్తులు కూడా ఈ విధంగానే  ఒకే హ్యాష్ ట్యాగ్ #వోకల్ ఫర్ హాండ్ మేడ్  క్రింద చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని కోరింది.

ఈ కార్యక్రమంలో జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్ మరియు (చేనేత) అభివృద్ధి కమిషనర్ శ్రీ సంజయ్ రస్తోగి  మరియు దేశం నలుమూలల నుండి  చేనేత సంబంధీకులు పాల్గొన్నారు. దేశంలోని చేనేత క్లస్టర్లు, 28 చేనేత సహాయక కేంద్రాలు, 6 భారతీయ చేనేత సాంకేతిక సంస్థలు, జాతీయ చేనేత అభివృద్ధి కార్పోరేషన్, చేనేత ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు దేశంలోని నిఫ్ట్ లు, కులు చేనేత నైపుణ్య గ్రామం, ముంబైలోని జౌళి కమిటీలు ఈ కార్యక్రమంతో లింక్ చేయబడ్డాయి.

చేనేతను భారీ ఎత్తున ప్రోత్సహించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాల వారు చేనేత ఉత్పత్తులను  చేనేత కార్మికులు లేదా ఉత్పత్తి దారుల నుండి నేరుగా కొనేందుకు వీలుగా గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ను ఏర్పరచింది.

అంతేకాక చేనేతకారులకు వివిధ చేనేత పథకాల లబ్దిని చేకూర్చేందుకు దేశంలోని ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ప్రత్యేకించి ఇందులో చేనేతకారులు వ్యక్తిగతంగా  ఉత్పత్తి చేస్తూ కానీ లేదా స్వయం సహాయక బృందాల ద్వారా ఈ పథకాల లబ్దిని పొందవచ్చు. 

***



(Release ID: 1644217) Visitor Counter : 354