ప్రధాన మంత్రి కార్యాలయం

సోమవారం ఆగస్టు 10వ తేదీ న అండమాన్ & నికోబార్ దీవుల (ఎ&ఎన్ఐ) లో సబ్ మరీన్ కేబుల్ కనెక్టివిటీ ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ మోదీ
అండమాన్ & నికోబార్ దీవుల కోసం హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటి
చెన్నై- పోర్ట్ బ్లయర్ మరియు పోర్ట్ బ్లేయర్, ఇంకా 7 ద్వీపాల నడుమ సుమారు 2300 కి.మీ. పొడవైన అండర్ సీ కేబుల్
ఇ-గవర్నెన్స్ కు, పర్యటన కు మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన రంగాల కు ఒక పెద్ద ప్రోత్సాహం

Posted On: 07 AUG 2020 2:41PM by PIB Hyderabad

చెన్నై ని మరియు పోర్ట్ బ్లేయర్ ను కలిపే సబ్ మరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎప్ సి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి మరి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.  ఈ సబ్ మరీన్ కేబుల్ పోర్ట్ బ్లేయర్ ను స్వరాజ్ ద్వీప్ (హావ్ లాక్), లిటిల్ అండమాన్, కార్ నికోబార్, కమ్ రోతా, గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలండ్ మరియు రంగత్ లతో కూడాను సంధానించనున్నది.  ఈ సంధానం అండమాన్ & నికోబార్ దీవుల కు భారతదేశం లోని ఇతర ప్రాంతాల తో సమానం గా వేగవంతమైనటువంటి మరియు మరింత నమ్మదగినటువంటి ల్యాండ్ లైన్, ఇంకా మొబైల్ టెలికం సేవల యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని అందించనున్నది.  ఈ పరియోజన కోసం గౌరవనీయ ప్రధాన మంత్రి పోర్ట్ బ్లేయర్ లో 2018వ సంవత్సరం లో డిసెంబర్ 30 వ తేదీ నాడు శంకుస్థాపన చేయడం జరిగింది.

సబ్ మరీన్ ఒఎఫ్ సి లింకు ఒక సారి ప్రారంభానికి నోచుకొందీ అంటే గనక, అది చెన్నై మరియు పోర్ట్ బ్లేయర్ ల నడుమ న 2 x 200 గీగా బిట్స్ పర్ సెకండ్ (జిబిపిఎస్) బ్యాండ్ విడ్త్ ను, ఇంకా పోర్ట్ బ్లేయర్ మరి ఇతర ద్వీపాలకు నడుమ న 2 x 100 జిబిపిఎస్ బ్యాండ్ విడ్త్ ను అందించగలదు.  ఈ ద్వీపాల లో విశ్వసనీయమైనటువంటి, దృఢమైనటువంటి, ఇంకా హై-స్పీడ్ టెలికమ్ మరియు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాల లభ్యత అటు వినియోగదారుల దృష్టికోణం నుండే కాక ఇటు పాలనపరమైనటువంటి, ఇంకా వ్యూహాత్మకమైనటువంటి కారణాల రీత్యా కూడాను ఒక మైలురాయి అనదగ్గ కార్యసిద్ధి కాగలదు.  ఉపగ్రహం మాధ్యమం ద్వారా సమకూర్చబడినటువంటి పరిమిత బ్యాక్ హాల్ బ్యాండ్ విడ్త్ కారణం గా సంయమానికి లోనైనటువంటి 4జి మొబైల్ సర్వీసులు కూడాను ఒక పెద్ద వృద్ధి ని నమోదు చేయగలుగుతాయి.

టెలికమ్ మరియు బ్రాడ్ బ్యాండ్ సంధానం ద్వీపాల లో ఉపాధి కల్పన కు మరియు పర్యటన కు అవకాశాల ను పెంపు చేయనుంది.  అక్కడి ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు జీవన ప్రమాణాల ను వృద్ధి చేయనుంది.  ఉత్తమమైనటువంటి సంధానం టెలిమెడిసిన్ ఇంకా టెలి-ఎజుకేశన్ ల వంటి ఇలెక్ట్రానిక్ గవర్నెన్స్ సర్వీసెస్ ను బట్వాడా చేయడానికి కూడాను మార్గాన్ని సుగమం చేయనుంది.  ఇ-కామర్స్ లో అవకాశాల నుండి చిన్న వ్యాపార సంస్థ లు లబ్ధి ని పొందనుండగా, అధికమైన బ్యాండ్ విడ్త్ అందుబాటు లోకి రావడం తో దీనిని ఇ-లర్నింగ్ కోసం మరియు జ్ఞానాన్ని పంచడం కోసం విద్యా సంస్థలు వినియోగించుకోనున్నాయి.  బిజినెస్ ప్రోసెస్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ మరియు ఇతర మధ్య తరహా, భారీ వ్యాపార సంస్థలు కూడాను మెరుగైనటువంటి సంధానం యొక్క ప్రయోజనాల ను పొందగలుగుతాయి.     
 
ఈ పరియోజన కు భారత ప్రభుత్వం కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు చెందిన టెలికమ్యూనికేశన్స్ విభాగం పరిధి లోని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేశన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది.  ఈ పరియోజన ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అమలుపరచింది.  కాగా టెలికమ్యూనికేశన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్) సాంకేతిక సలహాదారు గా వ్యవహరించింది.  సుమారు 1224 కోట్ల రూపాయల వ్యయం తో దాదాపు 2300 కి.మీ. ల సబ్ మరీన్ ఒఎఫ్ సి కేబుల్ ను వేయడం జరిగింది; మరి ఈ యొక్క ప్రాజెక్టు ను అనుకొన్న కాలం లోపల పూర్తి చేయడమైంది. 


***(Release ID: 1644172) Visitor Counter : 145