ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి కి మరియు శ్రీ లంక ప్రధాని కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ

Posted On: 06 AUG 2020 9:02PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ లంక ప్రధాని మాన్య శ్రీ మహింద రాజపక్షె తో మాట్లాడారు.  నిన్నటి రోజు న శ్రీ లంక లో పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణ సఫలం అయినందుకు గాను ఆయన కు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.   ప్రపంచ వ్యాప్త వ్యాధి కోవిడ్-19 పరం గా అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ కూడాను ఎన్నికల ను గుణకారకం గా నిర్వహించిన శ్రీ లంక కు చెందిన ఎన్నికల సంబంధి సంస్థల ను మరియు ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.  ఎన్నికల లో శ్రీ లంక ప్రజలు ఉత్సాహం తో పాల్గొన్నందుకుగాను వారిని కూడాను ఆయన అభినందించారు.  ఈ ధోరణి ఇరు దేశాలలోని బలమైనటువంటి ఉమ్మడి ప్రజాస్వామిక విలువల ను ప్రతిబింబిస్తున్నది అని ఆయన అన్నారు. 
 
ఒక్కటొక్కటి గా వెల్లడి అవుతున్న ఎన్నికల ఫలితాలు శ్రీ లంక పోదుజన పెరమున (ఎస్ఎల్ పిపి) పార్టీ ప్రభావశాలి ప్రదర్శన ను కనబరచినట్టు సూచిస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.  ఈ విషయం లో మాన్య శ్రీ మహింద రాజపక్షె కు ఆయన తన అభినందనల ను మరియు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. 
 
మునుపు వారి మధ్య చోటు చేసుకొన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి మరియు ఫలప్రదమైనటువంటి సంభాషణల ను ఇరువురు నేత లు గుర్తుకు తెచ్చుకొంటూ, యుగాల నాటిది మరియు బహువిస్తారితమైనటువంటిది అయిన భారతదేశం- శ్రీ లంక సంబంధాన్ని బలవత్తరపరచుకొనేందుకు ఉమ్మడి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు. 
  
భారతదేశం లో గల బౌద్ధ తీర్థస్థలమైన కుశీనగర్ లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పిన సంగతి ని మాన్య శ్రీ రాజపక్షె కు ప్రధాన మంత్రి తెలియజేశారు.  కుశీనగర్ వీలయినంత త్వరలో శ్రీ లంక నుండి విచ్చేసే సందర్శకుల కోసం నిరీక్షిస్తోందని కూడా ఆయన అన్నారు.  

కోవిడ్ విశ్వమారి రువ్విన సవాళ్ల ను పరిష్కరించడం లో ఉభయ దేశాలు సన్నిహిత సంప్రదింపుల ను జరుపుకొంటూ ఉండాలని నేతలు అంగీకరించారు, మరి అలాగే ద్వైపాక్షిక సంబంధాల ను రాబోయే రోజుల లో నూతన శిఖరాల కు చేర్చాలి అని కూడాను వారు దృఢసంకల్పం తీసుకొన్నారు.
 

***

 


(Release ID: 1644005)