ప్రధాన మంత్రి కార్యాలయం
రేపటి రోజు న జరిగే ‘కాన్ క్లేవ్ ఆన్ ట్రాన్స్ ఫర్ మేశనల్ రిఫార్మ్ స్ ఇన్ హయర్ ఎజుకేశన్ అండర్ నేశనల్ ఎజుకేశన్ పాలిసి’ లో ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్న ప్రధాన మంత్రి
Posted On:
06 AUG 2020 1:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అనగా 2020వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ న, ‘కాన్ క్లేవ్ ఆన్ ట్రాన్స్ ఫర్ మేశనల్ రిఫార్మ్ స్ ఇన్ హయర్ ఎడ్యుకేశన్ అండర్ నేశనల్ ఎడ్యుకేశన్ పాలిసి’ లో ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.
విద్య మంత్రిత్వ శాఖ మరియు యూనివర్సిటి గ్రాంట్స్ కమిశన్ ఈ కాన్ క్లేవ్ ను నిర్వహిస్తున్నాయి.
జాతీయ విద్య విధానం, 2020 లోని సమగ్ర విద్య, బహువిషయక విద్య మరియు భావి కాలపు విద్య, నాణ్యమైన పరిశోధన, ఇంకా విద్య మరింత ఉత్తమమైన రీతి లో వ్యాప్తి చెందేందుకు గాను సాంకేతిక విజ్ఞానాన్ని ధర్మబద్ధం గా ఉపయోగించడం వంటి ప్రముఖ దృష్టికోణాలపై ప్రత్యేక సమావేశాలు ఈ కాన్ క్లేవ్ లో చోటు చేసుకోనున్నాయి.
విద్య శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ తో పాటు విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ముసాయిదా ఎన్ఇపి సంఘం చైర్ మన్ మరియు సభ్యులు సహా పలువురు ప్రముఖులే కాకుండా ప్రసిద్ధ విద్యావేత్తలు/వైజ్ఞానికులు కూడా జాతీయ విద్య విధానం యొక్క భిన్న దృష్టికోణాల పై ప్రసంగించనున్నారు.
విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, విద్యాసంస్థల యొక్క సంచాలకులు మరియు కళాశాలాధిపతులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని ఫేస్ బుక్ లో విద్య మంత్రిత్వ శాఖ కు చెందిన పేజీ అయిన https://www.facebook.com/HRDMinistry/ లో,
యుజిసి యు ట్యూబ్ చానల్ లో,
పిఐబి యు ట్యూబ్ చానల్ లో, ఇంకా
యుజిసి ట్విటర్ హ్యాండల్ (@ugc_india) : https://twitter.com/ugc_india?s=12 లో నేరు గా ప్రసారం చేయడం జరుగుతుంది.
డిడి న్యూజ్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.
***
(Release ID: 1643888)
Visitor Counter : 210
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam