ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో కోవిడ్ చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు రెట్టింపు

మొత్తం కోలుకున్నవారు 12.3 లక్షలు

66.31శాతానికి పెరిగిన కొలుకున్నవారి శాతం

పాజిటివ్ కేసుల్లో 2.1శాతానికి తగ్గిన మరణాలు

Posted On: 04 AUG 2020 7:55PM by PIB Hyderabad

కోవిడ్ బారిన పడిన వారిలో  మొత్తం 12,30,509 మంది కోలుకోవటంతో భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు రెట్టింపు నమోదయ్యారు.  గడిచిన 24 గంటల్లో 44,306 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాజిటివ్ కేసుల్లో కోలుకున్నవారు 66.31శాతానికి పెరిగారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో చేసిన కృషి ఫలితంగాను, వైద్య సిబ్బంది అవిశ్రాంత కృషి, నిస్వార్థమైన సేవల వల్ల కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.


ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 5,86,298 మంది కాగా పాజిటివ్ గా నమోదైన కేసుల్లో వారు 31.59% గా ఉన్నారు.  వీరందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.  
సమర్థవంతమైన నివారణ చర్యలు, దూకుడుగా టెస్టింగ్ సంఖ్య పెంచటం, సమగ్రంగా చికిత్సావిధానాలను అమలు చేయటం వంటి చర్యల ఫలితంగా మరణాల రేటు అదుపులో ఉంది. భారత్ లో మొదటి లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకూ 2.10% శాతం నమోదైంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ.


మరణాల సమాచారాన్ని విశ్లేషించి చూస్తే, 50% మరణాలు 60 ఏళ్ళు పైబడ్డవారిలో నమోదయ్యాయి. 37% మరణాలు 45 - 60 మధ్య వయసున్నవారిలో కాగా 11% మరణాలు 26-44 వయోవర్గంలోని వారివి.  దీన్నిబట్టి  45 ఏళ్ళు పైబడ్డ వారు ఎక్కువ రిస్క్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. అందుకే వైరస్ నివారణ చర్యల్లో కూడా ఈ వయోవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. లింగ పరంగా చూస్తే మృతుల్లో 68% మంది మృతులు పురుషులు కాగా 32% మంది మహిళలు.

Slide8.JPG


భారత్ సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా మొదలైనప్పటినుంచి వెంటిలేటర్లు అందుబాటులో ఉంచింది. నిజానికి ఈ సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగినప్పటికీ మేకిన్ ఇండియా నినాదంతో స్వదేశీ తయారీకి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. మొదట్లో 75%  మార్కెట్ దిగుమతులమీదనే ఆధారపడేది. తీవ్రత పెరిగేకొద్దీ దిగుమతుల మీద ఆంక్షలు కూడా ఆయా దేశాలు పెంచుతూ వచ్చాయి.


దేశంలో 60,000 వెంటిలేటర్లు అవసరం ఉండగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలోని అరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ సారథ్యంలోని సాంకేతిక నిపుణుల కమిటీ వెంటిలేటర్లకు ఉండాల్సిన కనీస ప్రమాణాలను నిర్దేశించింది. దీనికి ముందు విస్తృతమైన సమాలోచనలు జరిపింది. భౌతికంగా వాటి పనితీరును పరిశీలించటంతోబాటు చికిత్సలోనూ వాడిచూసిన మీదటే ఆర్డర్ పెట్టి కొనుగోలు చేశారు.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***



(Release ID: 1643432) Visitor Counter : 187