ప్రధాన మంత్రి కార్యాలయం

భారత ప్రధానమంత్రి మరియు ఆఫ్గానిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుని మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 03 AUG 2020 5:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు  ఆఫ్గానిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ అష్రాఫ్ ఘనీ సోమవారం టెలిఫోన్ లో సంభాషించుకున్నారు.   ఇరువురు నాయకులు బక్రీద్ (ఈద్ ఉల్ అదా) పండుగ సందర్బంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  

ఆఫ్గానిస్తాన్ అవసరాల కోసం సమయానికి  ఆహారం,  వైద్యసహాయం అందజేసినందుకు భారత ప్రధానమంత్రి మోదీకి ఆఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు.   శాంతియుతమైన, సంపన్నమైన మరియు సమగ్రమైన ఆఫ్గానిస్తాన్ కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న శోధనలో వారికి తోడ్పాటును అందించేందుకు ఇండియా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను గురించి, పరస్పరం ద్వైపాక్షిక ప్రయోజనకరమైన అంశాల గురించి  ఇద్దరు నాయకులు పరస్పరం అభిప్రాయాలు వ్యక్తంచేశారు.


 

****



(Release ID: 1643227) Visitor Counter : 265