ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొదటి లాక్ డౌన్ మొదలు పాజిటివ్ కేసుల్లో మృతులు కనిష్టంగా 2.15%

మొత్తం కోలుకున్నవారు దాదాపు 11 లక్షలు

గత 24 గంటల్లో కోలుకున్నవారు 36,500

Posted On: 01 AUG 2020 2:43PM by PIB Hyderabad

అంతర్జాతీయ స్థాయిలో భారత్ లోనే అతి తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్ గా తేలిన కేసుల్లో మరణాలు ఈరోజు వరకు 2.15% ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొదటి లాక్ డౌన్ మొదలైనప్పటినుంచి ఇదే అత్యల్పం. జూన్ మధ్యలో 3.33% ఉండగా క్రమంగా అది తగ్గుతూ వస్తోంది.

తదేక దృష్టితో సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ " పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు " అనే ముక్కోణపు వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం సాధిస్తూ ముమ్దుకు సాగాయి. దూకుడుగా పరీక్షలు నిర్వహించటం ద్వారా వరకు తొలి దశలోనే వైరస్ ను గుర్తించటం, ఆస్పత్రులలో చేరిన బాధితులకు తగిన చికిత్స అందించటం ద్వారా భారత్ కోవిడ్ మరణాల సంఖ్య విజయవంతంగా తగ్గించటం సాధ్యమైంది.

WhatsApp Image 2020-08-01 at 13.15.50.jpeg


మరణాల శాతం తగ్గించటంతోబాటు నివారణ చర్యలు సమర్థంగా పాటించటం, చాలా దూకుడుగా పరీక్షల సంఖ్య పెంచే వ్యూహం అనుసరించటం, చికిత్సలోనూ ప్రమాణాలు పాటించటం వలన సగటున రోజూ 30,000 మందికి పైగా  కోలుకున్నవారి సంఖ్యను పెంచుకుంటూ పోవటం సాధ్యమైంది.

కోలుకున్నవారి సంఖ్య దాదాపుగా 11లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 36,569 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 10,94,374 కు చేరింది. ఆ విధంగా కోవిడ్ బాధితులలో కోలుకున్నవారి శాతం 64.53 కు ఎగబాకింది.

ఇలా కోలుకున్నవారి సంఖ్య అదే స్థాయిలో పెరుగుతూ ఉండటంతో కోలుకున్నవారికీ, బాధితులకూ మధ్య తేడా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 5,29,271 కాగా ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉన్నవారు 5,65,103 మంది ఉన్నారు.

మూడంచెల ఆస్పత్రి మౌలిక సదుపాయాల కారణంగా బాధితుల గుర్తింపు, చికిత్స నిరంతరాయంగా కొనసాగటం సాధ్యమైంది. నేటికి పూర్తిగా కోవిడ్  కే పరిమితమైన ఆస్పత్రుల సంఖ్య 1488 చేరుకోగా అందులో 2,49,358  ఐసొలేషన్ పడకలు, 31,639 ఐసియు పడకలు, 1,09,119 ఆక్సిజెన్ తో కూడిన పడకలు,  16,678 వెంటిలేటర్లు ఉన్నాయి.  కోవిడ్ అరోగ్య కేంద్రాల సంఖ్య 3231 కాగా అందులో 2,07,239 ఐసొలేషన్ పడకలు, 18,613 ఐసియు పడకలు, 74,130 ఆక్సిజెన్ తో కూడిన పడకలు,  6,668 వెంటిలేటర్లు వాడకంలో ఉన్నాయి. ఇవి కాకుండా 10,755 కోవిడ్ రక్షణ కేంద్రాలుండగా వాటిలో 10,02,681 పడకలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇప్పటివరకూ 273.85 లక్షల ఎన్ 95 మాస్కులు, 121.5 లక్షల పిపిఇ కిట్లు, 1083.77 లక్షల హెచ్ సి క్యూ టాబ్లెట్లు వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf


 

****



(Release ID: 1642871) Visitor Counter : 170