ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో మొత్తం కోవిడ్-19 నుండి కోలుకున్నవారి సంఖ్య 10 లక్షల మైలురాయిని దాటింది.
వరుసగా 7వ రోజున 30,000 కంటే ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి.
16 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో జాతీయ సగటు రికవరీ 64.44 శాతాన్ని మించి నమోదయ్యింది.
24 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో కేసు మరణాల రేటు జాతీయ సగటు 2.21 శాతం కన్నా తక్కువగా నమోదయ్యింది.
Posted On:
30 JUL 2020 6:15PM by PIB Hyderabad
భారతదేశం కోవిడ్-19 నుండి కోలుకున్నవారి విషయంలో 10 లక్షలను మించిన మైలురాయిని సాధించింది.
వైద్యులు, నర్సులతో పాటు ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల విధి మరియు నిస్వార్థ త్యాగానికి, సంపూర్ణ అంకితభావానికి ఇది నిదర్శనం, ఇది కోవిడ్-19 రోగులు ఎక్కువ సంఖ్యలో కోలుకోవాలనే ఆశయానికి వాస్తవరూపాన్నిచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రలు / కేంద్రపాలితప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు కోవిడ్-19 నిర్వహణ వ్యూహాన్ని సమన్వయంతో అమలు చేయడం ద్వారా జూన్ ప్రారంభంలో ఒక లక్షగా ఉన్న రికవరీల సంఖ్య నిరంతరం పెరుగుతూ, ఈ రోజున 10 లక్షలకు పైగా నమోదయ్యింది.
సంపూర్ణ ప్రామాణిక సంరక్షణ విధానం ఆధారంగా సమర్థవంతమైన నియంత్రణ వ్యూహం, భారీ సంఖ్యలో పరీక్షలతో పాటు, ప్రామాణిక వైద్య చికిత్సా యాజమాన్య పద్దతులను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమలు చేయడంతో వరుసగా ఏడవ రోజున కూడా రోజుకు 30,000 రికవరీలకు మించి స్థిరమైన ధోరణి కొనసాగుతోంది. జూలై మొదటి వారంలో సగటున 15,000 రోజువారీ రికవరీల నుండి గత వారంలో 35,000 సగటు రోజువారీ రికవరీల స్థాయికి నిరంతర పెరుగుదల నమోదయ్యింది.
గత 24 గంటల్లో 32,553 మంది రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి కావడంతో, మొత్తం రికవరీలు 10,20,582 కు పెరిగాయి. కోవిడ్-19 రోగులలో ఈ రోజు రికవరీ రేటు 64.44 శాతంగా నమోదయ్యింది. చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య మరియు కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మధ్య అంతరం ప్రస్తుతం 4,92,340 గా ఉంది. దీంతో, ఆసుపత్రుల్లో వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న (5,28,242 మంది) రోగుల సంఖ్య కంటే, చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య 1.9 రెట్లు అధికంగా ఉంది.
ఎటువంటి అవరోధాలు లేని వైద్య చికిత్స యాజమాన్యం కోసం సరసమైన ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో అనేక చర్యలు తీసుకున్నాయి. జాతీయ సగటు రేటు కంటే 16 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో అధిక రికవరీ రేటు నమోదు కావడం కూడా విజయంగా భావించవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రయత్నాలను సమన్వయపరచి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం మరియు ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా కోవిడ్-19 రోగులను ముందస్తుగా గుర్తించడంతో పాటు ప్రాణాంతక పరీక్షలు చేయడం తక్కువ మరణాలకు దారితీసింది. తీవ్రమైన కేసులు మరియు అధిక-ప్రమాద జనాభాకు సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యాధిని ముందుగా గుర్తించి, వారిని ఐసోలేషన్ లో చికిత్సనందిస్తూ, నియంత్రణ వ్యూహంపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 4 శాతంగా ఉన్న సగటుతో పోలిస్తే, భారతదేశంలో 2.21 శాతంతో అతి తక్కువ కేస్ మరణాల రేట్ (సి.ఎఫ్.ఆర్) నమోదౌతోంది. 24 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా సి.ఎఫ్.ఆర్. నమోదౌతుండగా, 8 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో సి.ఎఫ్.ఆర్. ఒక శాతం కన్నా తక్కువగా నమోదౌతోంది.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,
సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం
ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను
దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా,
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046
లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన
కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1642465)
Visitor Counter : 222
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam