ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటర్ నేశనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియేక్టర్ (ఐటిఇఆర్) లో జరిగిన ఐటిఇఆర్ అసెంబ్లీ యొక్క ఆరంభం సందర్భం లో భారతదేశం మాన్య ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం

Posted On: 29 JUL 2020 8:35PM by PIB Hyderabad

ఐటిఇఆర్ ఆర్గనైజేశన్ ఈ రోజు న అంటే 2020వ సంవత్సరం జూలై 28వ తేదీ నాడు ఫ్రాన్స్ లోని సెంట్- పౌల్- లెజ్- డ్యూరెంస్ లో ఐటిఇఆర్ టోకోమక్ యొక్క స్టార్ట్ ఆఫ్ అసెంబ్లీ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నది.  ఐటిఇఆర్ లో సభ్యత్వాన్ని కలిగివున్నటువంటి మరియు ఆహ్వానించబడినటువంటి అన్ని దేశాల అధినేత లు అయితే స్వయం గా గాని, లేదంటే రిమోట్ పద్దతి న ఇలెక్ట్రానిక్ మాధ్యమం ద్వారా గాని, లేదా అతడి యొక్క/ఆమె యొక్క సందేశాన్ని పంపడం ద్వారా గాని ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్నారు.  ఈ కార్యక్రమాని కి అధ్యక్షుడు మాన్య శ్రీ మేక్రోన్ వర్చువల్ మాధ్యమం ద్వారా ఆతిథేయి గా వ్యవహరించారు.

తన సందేశం లో మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఐటిఇఆర్ సంస్థ ఇప్పటి వరకు చేసిన కఠోర శ్రమ కు మరియు సాధించిన సఫలత కు గాను సంస్థ ను అభినందించారు.  ప్రపంచవ్యాప్త వైజ్ఞానికులు మరియు ఇంజినీయర్ ల సహభాగిత్వాన్ని ఆయన పరిగణన లోకి తీసుకొంటూ ఐటిఇఆర్ యుగాల తరబడి భారతదేశం పెట్టుకొన్న ‘వసుధైవ కుటుంబకమ్’ (ఈ మాట కు - మానవాళి అభ్యున్నతి కోసం యావత్తు ప్రపంచం కలసికట్టు గా కృషి చేస్తున్నది- అని భావం) అనేటటువంటి నమ్మకానికి ఒక పరిపూర్ణమైనటువంటి  దృష్టాంతం గా ఉందని,  ఐటిఇఆర్ తన లక్ష్యాల ను సాధించి వాటి ని ఆచరణ లోకి తీసుకు రాగలిగేందుకు సహాయాన్ని అందించడం కోసం భారతదేశం తన వంతు గా క్రయోస్టాట్, ఇన్ వెసల్ శీల్డ్స్, జల శీతలీకరణ, క్రయోజనిక్ మరియు క్రయో-డిస్ట్రిబ్యూశన్ సిస్టమ్స్, ఆర్ ఎఫ్ ఇంకా బీమ్ సాంకేతికత ల ను ఉపయోగించే ఆక్సిలరీ హీటింగ్ డివైసెస్ , మల్టి మెగా వాట్ పావర్ సప్లయిస్, 
ఇంకా అనేక డాయగ్నొస్టిక్స్ ల పరం గా తోడ్పాటు ను అందిస్తూ గర్వపడుతున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు.   

ఈ సందర్భం లో, భారతదేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని ఫ్రాన్స్ మరియు మొనాకో ల కు భారతదేశం రాయబారి గా ఉన్న శ్రీ జావేద్ అశ్ రఫ్ చదివి వినిపించారు. 

సందేశం యొక్క పూర్తి పాఠాన్ని ఈ దిగువ న ఇచ్చిన లింక్ లో చదవగలరు.


http://dae.gov.in/writereaddata/iter2020_message_pm_india_shri_narendra_modi.pdf

***



(Release ID: 1642258) Visitor Counter : 256