ప్రధాన మంత్రి కార్యాలయం

బ్యాంకు లు మరియు ఎన్ బిఎఫ్ సి ల కు చెందిన స్టేక్ హోల్డర్స్ తో ప్రధాన మంత్రి సంభాషణ

Posted On: 29 JUL 2020 10:05PM by PIB Hyderabad

భవిష్యత్తు లో ఆచరణ కు ఉద్దేశించినటువంటి ఒక మార్గ సూచి ని గురించి మరియు సంబంధిత దృష్టికోణం గురించి ఉన్నత స్థాయి లో చర్చించడం కోసం బ్యాంకుల కు, ఇంకా ఎన్ బిఎఫ్ సి లకు చెందిన స్టేక్ హోల్డర్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ రోజు న ముఖాముఖి సంభాషించారు.

వృద్ధి కి దన్ను గా నిలవడం లో ఆర్థిక మరియు బ్యాంకింగ్ వ్యవస్థ కు గల కీలక పాత్ర ను గురించి చర్చించడమైంది. చిన్న నవ పారిశ్రామికవేత్త లు, ఎస్ హెచ్ జి లు, రైతు లు వారి వారి పరపతి అవసరాల ను తీర్చుకొనేందుకు మరియు ఎదిగేందుకు గాను సంస్థాగత రుణాల ను  వినియోగించుకొనేటట్టు వారి ని ప్రేరేపించవలసి ఉందని గమనించడం జరిగింది. 

పరపతి మంజూరు లో స్థిరమైన వృద్ధి ని నమోదు చేయడం కోసం ప్రతి ఒక్క బ్యాంకు అంతర్దర్శనం ద్వారా పున:పరీక్షించుకోవలసిన అవసరం ఉంది.  బ్యాంకు లు అన్ని ప్రతిపాదన ల విషయం లో ఒకే కొలమానం ఉపయోగించకూడదు, బ్యాంకు అనుమతించ తగినటువంటి మరియు ప్రముఖమైనటువంటి ప్రతిపాదనల ను గుర్తించాలి; ఇంకా, ఆ ప్రతిపాదన లు వాటి యొక్క యోగ్యత ను బట్టి ఆర్థిక సహాయాన్ని అందుకొనేటట్టు చూడాలి అంతే తప్ప పాత ఎన్ పిఎ ల పేరు తో కష్టపడకూడదు అని పేర్కొనడమైంది.

ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ వెన్నంటి నిలచిందని, ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ కు మద్దతివ్వడానికి మరియు బ్యాంకింగ్ వ్యవస్థ వృద్ధి ని ప్రోత్సహించడానికి అవసరపడే ఏ చర్యలనైనా సరే తీసుకోవడం కోసం ప్రభుత్వం సిద్ధం గా ఉందని ఉద్ఘాటించడమైంది.  

బ్యాంకు లు కేంద్రీకృత‌ సమాచార వేదిక ల వంటి ఫిన్ టెక్ పద్ధతుల ను అనుసరించడం, డిజిటల్ డాక్యుమెంటేశన్  మరియు సమాచారాన్ని పంచుకోవడం లో సహకరించుకోవడం వంటి చొరవలు తీసుకొంటూ  వినియోగదారుల ను సమీకరించుకోవడం కోసం డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలి.  ఈ పద్ధతులు పరపతి వ్యాప్తి ని విస్తరింపచేసుకోవడం లో, వినియోగదారుల కు సౌలభ్యాన్ని పెంచడం లో, బ్యాంకుల కు వ్యయాల ను కుదించడం లో మరియు మోసాల ను తగ్గించడం లో సహాయకారి కాగలవు.  

భారతదేశం ఒక బలిష్టమైన, తక్కువ వ్యయం తో కూడిన మౌలిక సదుపాయాల ను రూపొందించింది; ఇవి భారతదేశం లో ప్రతి ఒక్కరు ఎంతటి పరిమాణం కలిగిన డిజిటల్ లావాదేవీలను అయినా ఎంతో సౌలభ్యం తో చేపట్టేందుకు వీలు కల్పిస్తాయి.  బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థ లు రూపే మరియు యుపిఐ లను ఉపయోగించేలా వాటి యొక్క వినియోగదారుల ను క్రియాశీల రీతి న ప్రోత్సహించాలి.

ఎమ్ఎస్ఎమ్ఇ లకై అత్యవసర పరపతి మార్గం, అదనపు కెసిసి కార్డులు, ఎమ్ఎఫ్ఐ మరియు ఎన్ బిఎఫ్ సి లకై లిక్విడిటీ విండో వంటి పథకాల పురోగతి ని కూడా ను సమీక్షించడమైంది.  చాలావరకు పథకాల లో మహత్వపూర్ణ ప్రగతి సాధ్యపడిందని గమనించడం జరిగింది.  కాగా బ్యాంకులు అపేక్షిత లబ్ధిదారుల తో క్రియాశీల సంబంధాల ను నెఱపుతూ,  సంక్షోభ కాలం లో వారికి  సరి అయిన వేళ కు పరపతి సంబంధి సమర్థన అందేందుకు పూచీ పడటం కోసం మార్పు తటస్థించినప్పుడు ప్రతిచర్యల కు దిగే కంటే పరివర్తన కు నాంది పలుకుతూ ముందస్తు గానే చర్యల ను చేపట్టే వైఖరి ని అలవరచుకోవలసిన అవసరం ఉందని సూచించడమైంది.  


***


 



(Release ID: 1642250) Visitor Counter : 307