ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశం వరుసగా 2 వ రోజున, రోజుకు 5 లక్షలకు పైగా పరీక్షలు చేసింది.

ఈ రోజు వరకు మొత్తం 1.73 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించారు.

మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య (టి.పి.ఎం) 12,562 కు పెరిగింది

Posted On: 28 JUL 2020 5:28PM by PIB Hyderabad

"టెస్ట్ట్రాక్ట్రీట్" అంటే పరీక్షించడంవ్యాప్తిని గుర్తించడంచికిత్సనందించడం అనే వ్యహనికి అనుగుణంగా,  భారతదేశం వరుసగా రెండు రోజుల కంటే ఎక్కువగా ఒకే రోజులో 5 లక్షల కంటే ఎక్కువగా  కోవిడ్-19 పరీక్షలను చేసి రికార్డు సృష్టించింది. కోవిడ్-19 సానుకూల కేసులను ముందుగానే గుర్తించడం, వారిని ఐసోలేషన్ లో ఉంచడంతో పాటు, మొదటి ముఖ్యమైన చర్యగా భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలనే కేంద్రప్రభుత్వం మరియు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాల సంయుక్త మరియు కేంద్రీకృత ప్రయత్నాల ఫలితం ఇది. భారతదేశం మొత్తంమీద 2020 జులై, 26వ తేదీన 5,15,000 నమూనాలను పరీక్షించగా, 2020 జులై, 27వ తేదీన 5,28,000 నమూనాలను పరీక్షించడం జరిగింది. 

శ్రేణి మరియు అభివృద్ధి చెందుతున్న ప్రతిస్పందన ఫలితంగా దేశంలో పరీక్షా నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరించే పరీక్షా వ్యూహం ఏర్పడింది. ఇంతవరకు మొత్తం నిర్వహించిన పరీక్షల సంఖ్య  1.73 కోట్లు దాటింది.  మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 12,562 కు పెరిగింది. 

నోయిడా, ముంబై, కోల్‌కతాలో మూడు అధిక సామర్ధ్య పరీక్షా సదుపాయాలను ప్రవేశపెట్టడంతో భారతదేశ పరీక్షా సామర్థ్యం మరింతగా పెంపొందింది. వీటిని నిన్న ప్రధానమంత్రి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.  దేశంలోని పరీక్షా ప్రయోగశాలల నెట్‌ వర్కు 1310 ప్రయోగశాలలతో నిరంతరం బలోపేతమవుతోంది; వీటిలో ప్రభుత్వ రంగంలో 905 ప్రయోగశాలలు, ప్రయివేటు రంగంలో 405 ప్రయోగశాలలు ఉన్నాయి. 

ఆ ప్రయోగశాలల వివరాలు ఈ విధంగా ఉన్నాయి : 

*     రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్.  ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 668 (ప్రభుత్వ 407 + ప్రయివేటు:  261)  

*     ట్రూ-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 537 (ప్రభుత్వ :   467 + ప్రయివేటు : 70 )   

*     సి.బి-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 105 (ప్రభుత్వ : 31 + ప్రయివేటు :  74)   

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలు,

సలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం

 వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను

దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న

 మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనా,

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 

ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన

కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి :

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****


(Release ID: 1641865) Visitor Counter : 252