మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ హ్యాకథాన్ ఫైనల్ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగం

ఆగస్టు 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
పాలుపంచుకోనున్న ప్రధాని

ఇది 2020- స్మార్ట్ ఇండియా సాఫ్ట్ వేర్ హ్యాకథాన్ 4వ దశ గ్రాండ్ ఫైనల్
ఆగస్టు 1నుంచి 3వరకూ జరుగుతుంది: రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్.లైన్ లో గ్రాండ్ ఫైనల్
ప్రత్యేక వేదిక ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహణ
36గంటల గ్రాండ్ ఫైనల్ లో పాల్గొననున్న పదివేలమంది
ప్రభుత్వ శాఖలు, పారిశ్రామిక రంగం సమస్యల్లో కొన్నింటికి సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలు కనుగొనే కసరత్తు.

Posted On: 27 JUL 2020 5:24PM by PIB Hyderabad

    ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో ఆన్ లైన్ ద్వారా జరగనున్న హ్యాకథాన్ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 2020 ఆగస్టు 1 రాత్రి 7గంటలనుంచి జరిగే కార్యక్రమంలో  ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్నిశాంక్ మేరకు ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం,.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (..సి.టి..), పర్సిస్టెంట్ సిస్టమ్స్, 4 సంస్థలు కూడా ఇందులో  పాలుపంచుకుంటున్నాయి.

  స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహణకు సంబంధించి రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షత వహించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, ..సి.టి.సి. అనిల్ సహస్రబుధే, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్ రంజన్, మంత్రిత్వ శాఖలో చీఫ్ ఇన్నవేషన్ ఆఫీసర్ అభయ్ జేరే ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

 

    సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ,..స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ఎంతో వినూత్నమైన ప్రక్రియ అని, మనదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, సమస్యల పరిష్కారంకోసం సృజనాత్మక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కసరత్తు జరిపేందుకు ఇదో వినూత్న మార్గమని చెప్పారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపకల్పన చేసే పోటీలో     కసరత్తు నిర్విరామంగా, నిరాటంకంగా సాగుతుందని చెప్పారుఇందులో సాంకేతిక వరిజ్ఞానం కలిగిన విద్యార్థులు వివిధ సమస్యలకు సృజనాత్మక పరిష్కారం సూచించేలా ఆయా సమస్యలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు హ్యాకథాన్ లో వీలవుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాఖలు, ప్రైవేటు రంగ సంస్థలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం కనుగొనే కసరత్తులో విద్యార్థులు పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని, విద్యార్థులు అప్పటికప్పుడు, ప్రపంచ ప్రమాణాలతో కూడిన పరిష్కారాలు సూచించేందుకు అవకాశం ఉంటుందని కూడా మంత్రి వివరించారు.

     స్మార్ట్ ఇండియా హ్యాకథన్- 2020కి సంబంధించి విద్యార్థుల ఆలోచనలను వడపోసే తొలిదశ కార్యక్రమం గత జనవరిలో కళాశాల స్థాయి హ్యాకథాన్ ద్వారా ఇప్పటికే నిర్వహించారు. కళాశాల స్థాయిలో విజేతలుగా నిలిచిన బృందాలకు మాత్రమే జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో పాల్గొనే అర్హత కల్పించారు

తర్వాత,..జాతీయ స్థాయిలో నిపుణులు, మదింపుదారులు మరింత వడపోత జరిపి, గ్రాండ్ ఫైనల్ లో పాల్గొనే బృందాలను ఎంపిక చేశారు

  దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నెలకొన్న తరుణంలో స్మార్టిండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్ ను ఆన్ లైన్ లో నిర్వహించబోతున్నారని పోఖ్రియాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న బృందాలను ప్రత్యేకం వేదికతో అనుసంధానించడం ద్వారా గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నట్టు చెప్పారు.

  సంవత్సరం,..37 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 243 సమస్యాత్మక అంశాలకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 సమస్యలకు, పరిశ్రమలకు సంబంధించిన 20 సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు పదివేల మందికి పైగా విద్యార్థులు పోటీ పడబోతున్నారు. పరిష్కారం కనుగొనాల్సిన ప్రతి సమస్యాత్మక అంశానికి లక్ష రూపాయల బహుమతి పోటీలో ఉంటుంది. విద్యార్థుల సృజనాత్మక థీమ్ ను మినహాయిస్తే విజేతలకు వారి స్థాయి ఆధారంగా 3 బహుమతులు ఇస్తారు. ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా 75వేల రూపాయలు, తృతీయ బహుమతిగా 50వేల రూపాయలు చెల్లిస్తారు.

  స్మార్టిండియా హ్యాకథాన్ పోటీకి సంబంధించి ఇప్పటివరకూ మూడు దశలను విజయవంతంగా నిర్వహించగలిగామని, 2017లో జరిగిన స్మార్టిండియా హ్యాకథాన్ లో 42వేలమంది విద్యార్థులు పాల్గొన్నారని, 2019లో విద్యార్థుల సంఖ్య లక్షకు పెరిగిందని, తర్వాత 2019లో 2లక్షలకు చేరిందని మంత్రి పోఖ్రియాల్ వివరించారు. గతంలో జరిగిన హ్యాకథాన్లతో పోల్చితే 2020 స్మార్టిండియా హ్యాకథాన్ మరింత భారీగా జరుగుతోందని, తొలిదశలోనే నాలుగున్న లక్షల మందికిపైగా  విద్యార్థులు పాలుపంచుకున్నారని చెప్పారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల సృజనాత్మకతకు, వారు ఔత్సాహికంగా పాల్గొనే పోటీలకు, సంస్కృతికి ప్రోత్సాహం అందించేందుకే ఎంతో శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్వహించే స్మార్టిండియా హ్యాకథాన్ పోటీ ప్రపంచంలోనే అతిపెద్ద సృజనాత్మక పోటీగా రూపుదాల్చిందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానానికి ఇది ఉత్తమమైన ఉదాహరణఅని మంత్రి వ్యాఖ్యానించారు.

    ఇప్పటివరకూ నిర్వహించిన స్మార్టిండియా హ్యాకథాన్ పోటీల ద్వారా దాదాపు 331 ప్రోటోటైప్ నమూనాలను రూపొందించగలిగామని, 71 స్టార్టప్ సంస్థలు వివిధ దశల్లో రూపొందుతున్నాయని, 19 స్టార్టప్ కంపెనీలు విజయవతంగా నమోదయ్యాయని మంత్రి చెప్పారు. దీనికి తోడు 39రకాల పరిష్కారాలను వివిధ శాఖలకు పంపించగలిగామని, 64 పరిష్కారాలను మరింత మెరుగుపరిచేందుకు తగిన నిధులు అందించామని చెప్పారు.

  స్మార్టిండియా హ్యాకథన్ ద్వారా వివిధ రకాల ఆలోచనలు, భావనల ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉండాలని కేంద్రమంత్రి అన్నారు. ప్రధాని కలలు గన్న ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయా విద్యార్థి బృందాల స్థాయిని ఆలోచనలు, భావనలనుంచి ప్రొటోటైప్ నమూల వరకూ తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థినుంచి ఒకసారి ఒక ఆలోచన వచ్చినపుడు, దాన్ని స్టార్టప్ కంపెనీ ద్వారా గానీ, ఏదైనా ప్రభుత్వ విభాగం ద్వారా గానీ అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత సదరు విద్యార్థి మార్గదర్శకుడైన నిపుణుడిదేనని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలు, భావనలు ఎప్పుడూ వృథా కారాదని, వాటిని తప్పనిసరిగా అమలులోకి తెచ్చేందుకు తగిన వేదిక సిద్ధమయ్యేలా ప్రభుత్వ విభాగం, లేదా మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రొటోటైప్ నమూనాలకు, స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు మధ్య అంతరం వెంటనే పూడ్చివేయాలని, అప్పుడే వివిధ రకాల ఆలోచనలు, భావనలు స్టార్టప్.లుగా రూపుదాల్చుతాయని మంత్రి చెప్పారు. హ్యాకథాన్ పోటీలో తలెత్తే ఆలోచనలు విజయవంతమై, సముచితంగా అమలయ్యేలా చూడాలంటే, ఆయా మంత్రిత్వ శాఖలతో సమన్వయం ద్వారా సానుకూల పరిస్థితులను కల్పించాలని మంత్రి సూచించారు.

   హ్యాకథాన్ లో ఎంపికైన ఆలోచనలు వాస్తవ వినియోగంలోకి రావాలంటే, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి,.. మిగతా కార్యదర్శలందరితో సమన్వయంతో ఉండాలని,  స్మార్టిండియా హ్యాకథాన్ లో తలెత్తిన ఆలోచనల అమలయ్యేలా చూసేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్వయకర్త పాత్రను నిర్వహించాలని నిశాంక్ చెప్పారు. స్టార్టప్ కంపెనీలుగా రూపొందని భావనల్లో 90శాతాన్ని ఆయా శాఖల్లో అమలుకోసం కేటాయించాలన్నారు. స్మార్టిండియా హ్యాకథాన్ పోటీలో రూపుదాల్చిన ఆలోచనలకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని తాను కోరతానని, కార్యదర్శుల కమిటీ అజెండాలో భాగంగా ప్రక్రియను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తానని పోఖ్రియాల్ చెప్పారు.

  దేశంలో సృజనాత్మక సంస్కృతిని ప్రోత్సహించేందుకు సృజనాత్మక ఆలోచనలు పాఠశాల స్థాయిలోనే ప్రారంభం కావాలని, పాఠశాల స్థాయిలోని అటల్ సృజనాత్మక పరిశోధనశాలలను ఇందుకు తగినట్టుగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి వివిధ పాఠశాలల విద్యార్థులకు, ఇంజినీరింగ్ కాలేజీ పాఠ్యాంశాలకు మధ్య సరైన అనుసంధాన వ్యవస్థ ఉండాలని కేంద్రమంత్రి పోఖ్రియాల్ సూచించారు.

 

మరింత సమాచారం కోసం లింక్ ను సందర్శించండి : https://www.sih.gov.in/

***



(Release ID: 1641725) Visitor Counter : 191