ప్రధాన మంత్రి కార్యాలయం

అధిక ప్రవాహ సామర్థ్యం కలిగిన కోవిడ్-19 పరీక్ష సదుపాయాల ను జూలై 27 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2020 1:42PM by PIB Hyderabad

అధిక ప్రవాహ సామర్థ్యం కలిగిన కోవిడ్-19 పరీక్ష సదుపాయాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జూలై 27 వ తేదీ నాడు ప్రారంభించనున్నారు.  ఈ సదుపాయాలు దేశం లో పరీక్షల ను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతాయి, అంతే కాక విశ్వమారి ఆనవాళ్ల ను ముందుగానే పసిగట్టడం లో, తగ్గ ఉపచారం చేయడం లో ఈ సదుపాయాలు సహాయకారి గా ఉండి ఈ ప్రకారం గా ప్రపంచవ్యాప్త వ్యాధి వ్యాప్తి ని నియంత్రించడం లో తమ వంతు తోడ్పాటును అందిస్తాయి. 

ఈ మూడు అధిక ప్రవాహ సామర్థ్యం కలిగిన పరీక్ష సదుపాయాల ను వ్యూహాత్మక రీతి న నోయెడా లోని ఐసిఎమ్ఆర్- నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కేన్సర్ ప్రివెన్శన్ ఎండ్ రిసర్చ్ లోను, ముంబయి లోని ఐసిఎమ్ఆర్- నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఫార్ రిసర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్థ్ లోను మరియు కోల్ కాతా లోని ఐసిఎమ్ఆర్- నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కాలర ఎండ్ ఎన్ టెరిక్ లోను ఏర్పాటు చేయడమైంది.  ఇవి ప్రతి రోజూ 10,000 కు పైగా నమూనాల ను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగివుంటాయి.
ఈ సౌకర్యాలు జతపరచినటువంటి ప్రయోగశాల లు టర్న్-ఎరౌండ్ -టైమ్ ను తగ్గించగలవు; అలాగే, సాంక్రామిక రోగనిర్ధారణ సామగ్రి నుండి ఆరోగ్య రంగ సిబ్బంది ని కాపాడడం లో కూడాను దోహదిస్తాయి.    కోవిడ్ కు తోడు, ఇతర వ్యాధుల ను పరీక్షించే సత్తా ను కూడా ఈ ప్రయోగశాలల కు జోడించడమైంది.  విశ్వమారి ఉనికి మాయమైన అనంతరం హెపెటైటిస్ బి మరియు సి, హెచ్ ఐవి, మైకోబాక్టీరియమ్ ట్యుబర్ క్యులోసిస్, సైటోమెగాలోవైరస్, క్లైమైడియా, నీసేరియా, డెంగి మొదలైన వ్యాధుల కు సంబంధించిన పరీక్షల నుకూడా ఈ ప్రయోగశాలల్లో  చేసే వీలు ఉంది. 

ఈ కార్యక్రమం లో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, ఇంకా విజ్ఞానశాస్త్రం & సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా పాలుపంచుకోనున్నారు. 


***



(Release ID: 1641410) Visitor Counter : 240