రక్షణ మంత్రిత్వ శాఖ
'కార్గిల్ విజయ్ దివాస్' 21వ వార్షికోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరులకు 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద నివాళులర్పించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్
Posted On:
26 JUL 2020 3:57PM by PIB Hyderabad
కార్గిల్ యుద్ధం అని కూడా పిలువబడే 'ఆపరేషన్ విజయ్'లో భారత దేశం విజయం సాధించిన 21వ వార్షికోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలిచ్చిన ధీరులకు 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌తో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, డిఫెన్స్ స్టాఫ్ మరియు మిలిటరీ వ్యవహారాల కార్యదర్శి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నారావణే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మరియు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియాలు నివాళులర్పించారు. జులై 26, 1999న కార్గిల్‌లో భారత సాయుధ దళాల ఘన విజయం దేశ బలమైన రాజకీయ, సైనిక, దౌత్య చర్యల సమాహరమైన గొప్ప ధారావాహికత. ఈ విజయాన్ని స్మరించుకొంటూ భారత్ సగర్వంగా, గౌరవంగా ప్రేరణాత్మకంగా 'కార్గిల్ విజయ్ దివాస్'ను జరుపుకుంటోంది. నివాళులర్పించిన తరువాత రక్షణ మంత్రి వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల పుస్తకంలో ఒక సందేశాన్ని రాశారు. “ఈ రోజు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా, శత్రువుల నుండి మాతృ భూమిని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన భారత సాయుధ దళంలోని ధైర్య సైనికులకు నా నమస్కారం మరియు వందనం. ఈ యుద్ధంలో వీర మరణం చెందిన మన వీర సైనికుల ధైర్యం, శౌర్యం, నిగ్రహం మరియు సంకల్పాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది మరియు వారి అత్యున్నత త్యాగం నుండి ప్రేరణ పొంది ముందుకు సాగుతుంది.” అని రాశారు. కార్గిల్ విజయ్ దివాస్ కేవలం ఒక రోజు మాత్రమే కాదు.. ఈ దేశ సైనికుల ధైర్యం మరియు శౌర్యానికి ప్రతీకగా జరుపుకొనే వేడుక అని అన్నారు. భారత సైన్యం ధైర్యంతో ఇతర సైనికులు అధిగమించలేని అసమానతలను అధిగమించారు. తీవ్రప్రతికూల వాతావరణంలోనూ ఆధిపత్య ఎత్తులను ఆక్రమించిన శత్రువులను తరమికొట్టేందుకు గాను మన దేశ సైనికులు అసమానమైన శౌర్యాన్ని ప్రదర్శించి పోరాడారు. భారత వైమానిక దళం అందించిన వైమానిక సహాయంతో యుద్ధాన్ని గెలిచారు. ఈ చిరస్మరణీయ ఘటన సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జ్ఞాపకార్థం దేశ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ సివిల్ మరియు మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1641408)
Visitor Counter : 260