ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒకే రోజులో అత్యధిక రికవరీలు నమోదయ్యాయి; 36,000 మందికి పైగా రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్ చికిత్స పొందుతున్న రోగుల కంటే, వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4 లక్షల కంటే ఎక్కువగా ఉంది.

రికవరీ రేటు ఈ రోజు అత్యంత గరిష్టంగా దాదాపు 64 శాతానికి చేరింది.

Posted On: 26 JUL 2020 2:25PM by PIB Hyderabad

నిన్న ఒకే రోజులో అత్యధిక రికవరీలు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 36,145 కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయినా కోవిడ్ రోగుల సంఖ్య 8,85,576 కు చేరుకుంది.  రికవరీ రేటు అత్యంత గరిష్టంగా దాదాపు 64 శాతానికి చేరుకుంటోంది.  ఇది ఈ రోజు 63.92 శాతంగా నమోదయ్యింది. దీని అర్థం ఎక్కువ మంది రోగులు కోలుకుంటున్నారు, తద్వారా చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగులు మరియు ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మధ్య వ్యత్యాసం వేగంగా పెరుగుతోంది.  ఈ వ్యత్యాసం 4 లక్షలు దాటి ప్రస్తుతం 4,17,694 వద్ద ఉంది.  ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య (4,67,882) కంటే, చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 1.89 రేట్లు అధికంగా ఉంది. 

"టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్" అంటే పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడం అనే వ్యూహాన్ని కొనసాగించి, సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది.  ప్రప్రథంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,40,000 కంటే ఎక్కువ పరీక్షలు జరిగాయి.  గత 24 గంటల్లో 4,42,263 నమూనాలను పరీక్షించడంతో, మిలియన్ మందిలో జరిగిన పరీక్షల (టి.పి.ఎం) సంఖ్య 11,805 కు పెరగడంతో, ఇంతవరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 1,62,91,331 కి పెరిగింది.  మొదటిసారి ప్రభుత్వ ప్రయోగశాలలు మొత్తం 3,62,153 నమూనాలను పరీక్షించి కొత్త రికార్డును సృష్టించాయి.  అదేవిధంగా, ప్రయివేటు ప్రయోగశాలలు కూడా ఒకే రోజులో 79,878 నమూనాలను పరీక్షించి, కొత్త అత్యధిక రికార్దుకు చేరుకున్నాయి. 

ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రయత్నాలను సమన్వయ పరచి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచడం, కోవిడ్-19 రోగులను ముందస్తుగా గుర్తించడంతో పాటు వారికి ప్రాణాంతక పరీక్షలు చేయడం తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించడానికి దోహదపడ్డాయి.  ఫలితంగా, కేసు మరణాల రేటు క్రమంగా తగ్గింది, ప్రస్తుతం ఇది 2.31 శాతంగా నమోదయ్యింది.  ప్రపంచంలో అత్యల్ప మరణాల రేటు నమోదౌతున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది.  

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలు,

సలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం

 వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను

దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న

 మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనా,

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 

ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన

కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి :  

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

****



(Release ID: 1641385) Visitor Counter : 219