ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

క‌రోనా వైర‌స్ పేషెంట్ల ను చిన్న‌చూపు చూడ‌డం, కొవిడ్ బాధితుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన రీతిలో అంత్యక్రియ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌ని సంఘ‌ట‌న‌ల ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఉప‌రాష్ట్ర‌ప‌తి

న‌కిలీ వార్త‌లు, త‌ప్పుడు స‌మాచారం క‌న్న ప‌క్ష‌పాతం విష‌పూరిత‌మ‌ని, దీనిని ఎదుర్కొవాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి పిలుపు
క‌రోనావైర‌స్‌కు సంబంధించి అన్ని వాస్త‌వాల‌నూ ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు కృషి చేయాల్సిందిగా మీడియా, ఆరోగ్య శాఖ అధికారులకు పిలుపు

రైతుల‌తో స‌హా, కోవిడ్ -19 పై ముందుండి చిత్త‌శుద్ధితో పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు పిలుపు.

Posted On: 26 JUL 2020 12:23PM by PIB Hyderabad

 

కోవిడ్ -19 రోగుల‌ను చిన్న‌చూపు చూస్తున్న ఘ‌ట‌న‌ల‌ప‌ట్ల, అలాగే వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారి గౌర‌వ‌ప్ర‌ద‌మైన అంత్య‌క్రియ‌లకు నిరాక‌రిస్తున్న‌‌ ఘ‌ట‌న‌ల‌ప‌ట్ల‌ ఉప‌రాష్ట్ర‌ప‌తి శ్రీ ఎం.వెంక‌య్య‌నాయుడు  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు స‌రైన‌వి కావ‌ని , స్థానిక ప్ర‌జ‌లు, స‌మాజం మొత్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు.

ఇందుకు సంబంధించి, ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్‌పెడుతూ ఆయ‌న‌,“ ప‌క్ష‌పాత ధోర‌ణితో  వ్య‌వ‌హ‌రించ‌డంపై పోరాటం చేయాలి, దీనిని మొగ్గ‌లోనే తుంచేయాలి . లేకుంటే ఇది న‌కిలీ వార్త‌లు, తప్పుడు స‌మాచారం క‌న్న‌విష‌పూరిత‌మైన‌ది” అని ఆయ‌న అన్నారు. కోవిడ్ -19 రోగుల‌ను అర్థం చేసుకునే మ‌న‌సుతో చూడాల‌ని ,వారిప‌ట్ల సహానుభూతి చూపాల‌ని, ఆయ‌న అన్నారు. “ ఎవ‌రూ పూర్తిగా సుర‌క్షితం కాదు, క‌నిపించ‌ని వైర‌స్ ఎవ‌రికైనా సోక‌వ‌చ్చు న‌ని గుర్తుంచుకోవాలి” అని ఆయ‌న అన్నారు.

పురాత‌న కాలం నుంచీ, ఇండియా స‌హిష్ణుత‌కు పేరెన్నిక‌గ‌న్న‌భూమి అని, క‌ష్టాల‌లోఉన్న వారిని ఆదుకుని వారిప‌ట్ల సానుభూతి చూపుతూ వ‌చ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. క‌రోనా వైర‌స్ సోకిన వారిని స్వంత బంధువుల‌తో స‌హా కొంద‌రు చిన్న చూపుచూస్తున్న‌ట్టు,  ప్ర‌ధానంగా వైర‌స్ త‌మ‌కు సోకుతుంద‌న్న భ‌యంతో వారిని వెలివేస్తున్న‌ట్టు మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు క‌ల‌త‌పెడుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.


కోవిడ్ -19 కార‌ణంగా మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌ల‌కు స్థ‌లం స‌మ‌కూర్చ‌డానికి కూడా కొంద‌రు వ్య‌తిరేకిస్తున్న‌సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌, ఇలాంటివి ఎంత మాత్రం ఆమోద‌యోగ్య‌మైన‌వికావ‌ని, మ‌ర‌ణించిన వారి కుటుంబాల వారికి అండ‌గా నిలిచే  భార‌తీయ స‌నాత‌న సంప్ర‌దాయాల‌కు  ఇలాంటివి విరుద్ధ‌మైన‌వ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


 అవిద్య‌, మూఢ‌న‌మ్మ‌కాలు, న‌కిలీ వార్త‌లు, పుకార్ల వంటివి ప్ర‌జ‌ల‌లో త‌ప్పుడు విశ్వాసాల‌కు కార‌ణ‌మౌతాయ‌ని, ఆయ‌న అన్నారు. ఆరోగ్యఅధికారులు, మీడియా ఇందుకు సంబంధించి ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేప‌ట్టి క‌రోనా వైర‌స్‌గురించి, దాని వ్యాప్తి గురించి వాస్త‌వాల‌తో ప్ర‌జ‌ల‌లొ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పిలుపునిచ్చారు.“ స‌రైన సందేశాన్ని పున‌రుద్ఘాటించాలి. గ‌ట్టిగా చెప్పాలి. విస్తృతంగా ప్ర‌చారం చేయాలి. ఇది ప్ర‌జ‌ల‌లో ఆశించిన ప‌రివ‌ర్త‌న‌, సానుకూల మార్పు తెచ్చేదిగా ఉండాలి” అని ఆయ‌న పేర్కొన్నారు.


 కోవిడ్ మ‌హ‌మ్మారి సృష్టించిన దారుణ ప‌రిస్థితుల‌ను స‌మ‌ష్ఠి కృషి ద్వారానే ఎదుర్కోగ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. ముందుగా చేయ‌వ‌ల‌సింది వైర‌స్ వ్యాప్తి కేసుల సంఖ్య త‌గ్గేట్టు చూడ‌డ‌మ‌ని చెప్పారు. ఇందుకు
“ ప్ర‌తి పౌరుడూ బాధ్య‌‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ, త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకోవ‌డం, ముఖానికి మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి వాటికి క‌ట్టుబ‌డి ఉండాలి” అని ఆయ‌న అన్నారు.
ప్ర‌తివారూ రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టిపెట్టాల‌ని, ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు యోగా సాధ‌న చేయాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. చాలామంది ఈ సంక్షోభ స‌మ‌యంలో కోపం, అల‌స‌టకు లోనయ్యే అవ‌కాశం ఉంద‌ని, ఇందుకు సానుకూల దృక్ప‌థాలైన సంతృప్తి,కృత‌జ్ఞ‌త‌,స‌హానుభూతి, క్ష‌మ‌,  వంటి వాటినన్నిటినీ అల‌వ‌ర‌చుకోవాల‌ని శ్రీ వెంక‌య్య‌నాయుడు సూచించారు. “నిజానికి ఇది ఆథ్యాత్మికత సారాంశం ” అని ఆయ‌న అన్నారు.


ఈరోజు కార్గిల్ విజ‌య్‌దివ‌స్ గురించి ప్ర‌స్తావిస్తూ ఉప‌రాష్ట్ర‌ప‌తి“ కార్గిల్ విజ‌య్ దివ‌స్‌రోజు మ‌నం అమ‌ర సైనికుల‌కు నివాళుల‌ర్పించ‌డ‌మంటే, భార‌తీయ సాయుధ ద‌ళాలు దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని , మాతృభూమి ర‌క్ష‌ణ‌కు చూపే  శౌర్యం ,దేశ‌భ‌క్తి, వారి త్యాగానికి దేశం ఎన్న‌టికీ కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌డ‌మే”న‌ని ఆయ‌న అన్నారు.


 ఆహార‌భ‌ద్ర‌త‌కు నిస్వార్థ సేవలు అందిస్తూ ఎలాంటి అభినంద‌న‌ల‌కూ నోచుకోని రైత‌న్న‌ల‌కు , కోవిడ్‌పై పోరాటంలో ముందుంటున్న‌ ఆరోగ్య రంగంలోని వారు, పోలీసులు, మీడియా , పారిశుధ్య‌‌కార్మికులు ,స‌ర‌ఫ‌రా దారులు నిబ‌ద్ధ‌త‌తో సాగిస్తున్న కృషికి మ‌ద్ద‌తు నిస్తూ  వారికి  కృత‌జ్ఞ‌తలు తెల‌పాల్సిందిగా కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తి పిలుపునిచ్చారు.

***



(Release ID: 1641379) Visitor Counter : 196