ప్రధాన మంత్రి కార్యాలయం

పి.ఎమ్-ఎస్.వి.ఏ.నిధి పధకం అమలును సమీక్షించిన - ప్రధానమంత్రి

వీధి విక్రేతలు పూర్తిగా డిజిటల్ లావాదేవీలు ఉపయోగించే విధంగా ప్రోత్సహిస్తూ ఈ పధకాన్ని రూపొందించాలి : ప్రధానమంత్రి

ఈ పథకాన్ని కేవలం రుణాలను విస్తరించే కోణం నుండి చూడకూడదు, కానీ వీధి వ్యాపారులకు వారి సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం దోహదపడే పథకంగా చూడాలి : ప్రధానమంత్రి

Posted On: 25 JUL 2020 6:10PM by PIB Hyderabad

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పి.ఎం-ఎస్.వి.ఏ.నిధి పధకం అమలును ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ఈ ఉదయం సమీక్షించారు.

ఈ పధకం కింద, 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో 64,000 మందికి ఋణాలు మంజూరయ్యాయి, 5,500 మందికి పైగా ఋణాలు పంపిణీ చేసినట్లు సమాచారం.  పారదర్శకత, జవాబుదారీతనం మరియు వేగాన్ని నిర్ధారించడానికి పథకం నిర్వహణ కోసం వెబ్-పోర్టల్ మరియు మొబైల్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఐ.టి. పరిష్కారాలను వినియోగించడం సంతృప్తికరంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పథకాన్ని నిర్విఘ్నంగా అమలు చేయడానికి మొబైల్ అప్లికేషన్‌తో సహా పూర్తి ఐ.టి. పరిష్కారానికి గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   వీధి వ్యాపారులు పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తూ, ఈ పధకాన్ని రూపొందించాలని ప్రధానమంత్రి సూచించారు.  ఇది వారి వ్యాపారం యొక్క మొత్తం లావాదేవీలను - అంటే, ముడి పదార్థాల సేకరణ నుండి అమ్మకపు ఆదాయాల సేకరణ వరకు సహాయపడే విధంగా ఉండాలి.  ఇందుకోసం తగిన ప్రోత్సాహకాలు, శిక్షణలు నిర్వహించాలి.  వీధి విక్రేతల భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు సహాయం చేయడంలోనూ, ఋణ ప్రణాళికలను రూపొందించడంలోనూ కూడా డిజిటల్ చెల్లింపులు ఉపయోగపడతాయి. 

వీధి వ్యాపారులకు రుణాలు విస్తరించే కోణం నుండి మాత్రమే,  ఈ పథకాన్ని చూడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  వీధి వ్యాపారులకు వారి సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం దోహదపడే ఒక పథకంగా దీనిని చూడాలని ఆయన సూచించారు.   ఈ దిశలో మొదటి చర్యగా, అవసరమైన పాలసీకి వారిని అనుసంధానం చేయడానికి వీలుగా, వారి సామాజిక-ఆర్థిక వివరాలను పూర్తిగా సేకరించాలి.  ఇటువంటి డేటాను భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు కూడా ఉపయోగించుకుని, వారి అర్హతల మేరకు, ప్రాధాన్యతా క్రమంలో వివిధ పథకాల కింద ప్రయోజనం పొందే విధంగా చూడాలి. వీటిలో పి.ఎం.ఎ.వై-యు కింద గృహాలు, ఉజ్వల కింద వంట గ్యాస్, సౌభాగ్య కింద విద్యుత్తు, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యం, డే-ఎన్.యు.ఎల్.ఎమ్ కింద నైపుణ్యం, జన ధన్ కింద బ్యాంకు ఖాతా మొదలైనవి ఉన్నాయి.

నేపధ్యం :

ఒక సంవత్సర కాలంలో 10 వేల రూపాయల వరకు భాగస్వామ్య హామీ లేని వర్కింగ్ క్యాపిటల్ ఋణం, సుమారు 50 లక్షల మంది వీధి విక్రేతలు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి భారత ప్రభుత్వం పి.ఎం-ఎస్వి.ఏ.ఎ. నిధి పథకాన్ని ప్రారంభించింది.  రుణవాయిదాలు తిరిగి చెల్లించే మంచి అలవాటు మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వడ్డీ రాయితీ (సంవత్సరానికి 7 శాతం చొప్పున) మరియు క్యాష్ బ్యాక్ (సంవత్సరానికి 1,200 రూపాయల వరకు) ప్రోత్సాహకాలు అందించబడుతున్నాయి.  24 శాతం వార్షిక వడ్డీ చొప్పున, 10,000 వేల రూపాయల రుణంపై, మొత్తం వడ్డీ భారం పైన వడ్డీ రాయితీ 30 శాతంగా ఉంటుంది.  

అందువల్ల, విక్రేత సకాలంలో ఋణ వాయిదాలు తిరిగి చెల్లించి, అన్ని రశీదులు మరియు చెల్లింపులకు డిజిటల్ లావాదేవీలను ఉపయోగిస్తే, విక్రేత ఎటువంటి వడ్డీని చెల్లించనవసరంలేదు సరికదా, రుణ మొత్తంపై సబ్సిడీని కూడా  పొందుతారు.  ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని ముందుగా లేదా సకాలంలో తిరిగి చెల్లించినట్లైతే, తదుపరి రుణాన్ని మరింత ఎక్కువగా తీసుకోడానికి అర్హత పొందుతారు.  ఈ పధకం నిర్వహణ, అమలు సంస్థ, భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్.ఐ.డి.బి.ఐ) తో ఉన్న ఐటి వేదిక “పి.ఎం-ఎస్.వి.ఏ. నిధి” ద్వారా 2020 జూలై, 02వ తేదీ నుండి ఋణాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.

*****



(Release ID: 1641299) Visitor Counter : 215