రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎరువుల రంగంలో సులభతర వ్యాపారానికి అన్ని చర్యలూ తీసుకుంటున్న ప్రభుత్వం
Posted On:
25 JUL 2020 1:54PM by PIB Hyderabad
ఎరువుల రంగంలో సులభతర వ్యాపారానికి ఎన్.డి.ఎ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ తెలిపారు. ఇది ఆత్మనిర్భర్ కు వాస్తవ రూపం కల్పిస్తుందని, దీని ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు.
ఈదిశగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను వివరిస్తూ శ్రీ సదానంద గౌడ,, ఎరువుల విభాగం రైతులకు స్నేహపూర్వకంగా ఉండే డిబిటి 2.0 వర్షన్‌ను 2019 జూలై లో తీసుకువచ్చిందని అన్నారు. ఇది ప్రస్తుత డిబిటి వ్యవస్థను మెరుగుపరుస్తుందని, సులభతర వాడుకకు వీలుగా ఉంటుందని చెప్పారు. డి.బి.టి 2.0 వర్షన్‌లో మూడు కాంపొనెంట్‌లు ఉన్నాయి. అవి ఒకటి డిబిటి డాష్ బోర్డు కాగా రెండొది పిఒఎస్ 3.0 సాఫ్ట్‌వేర్, మూడోది డెస్క్‌టాప్ పిఒఎస్ వర్షన్.
డిబిటి డాష్‌బోర్డు వివిధ ఎరువుల సరఫరా, అందుబాటు, అవసరం వంటి వాటికి సంబంధించి ఖచ్చితమైన రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తాయి. దీనిని సాధారణ ప్రజలు ఎవరైనా https://urvarak.nic.in ద్వారా చూడవచ్చు.
పిఒఎస్ 3.0 సాఫ్ట్‌వేర్ వివిధ కేటగిరీల కొనుగోలు దారులకు అమ్మకాలను నమోదు చేస్తుంది. వివిధ భాషలలో అమ్మకపు రసీదులను తయారుచేస్తుంది. రైతులు సమతుల పద్దతిలో ఎరువులు వాడేందుకు వీలుగా భూసార సిఫార్సులు చేస్తుంది. డెస్కుటాప్ పిఒఎస్ వర్షన్ పిఒఎస్ పరికరానికి ప్రత్యామ్నాయ లేదా అదనపు సదుపాయం గా చెప్పుకోవచ్చు. ఇది మరింత పటిష్టమైనది, భద్రమైనది కూడా.
ఫర్టిలైజర్స్ కు చెందిన డిబిటి రెండు అవార్డులను గెలుచుకుంది. అవి ఒకటి 25-9-2019 న గెలుపొందిన సుపరిపాలనకు స్కాచ్ గోల్డ్ అవార్డు కాగా , మరొకటి 2019 నవంబర్ 6న గెలుచుకున్న గవర్నెన్స్ డిజిటల్ ట్రాన్సఫర్‌మేషన్ అవార్డు.దేశంలో ఎరువుల సరఫరా నెట్‌వర్కును సులభతరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ శ్రీ సదానంద గౌడ, అదనపు రవాణా పద్ధతి కింద తీరప్రాంత నౌకాసరకు రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు కోస్తా నౌకాయానం ద్వారా లేదా దేశీయ జలమార్గాలద్వారా సబ్సిడీ కలిగిన ఎరువుల పంపిణీకి సంబంధించిన రవాణా సబ్సిడీని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన విధానాన్ని17.6.2019, 18.9.2019లలో ప్రకటించడం జరిగింది. 2019-20 సంవత్సరంలో కోస్తా నౌకా రవాణా ద్వారా 1.14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను తరలించడం జరిగింది.
యూరియా యూనిట్లకు ధర నిర్ణయానికి సంబంధించి న నిబంధలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి సదానందగౌడ, సిసిఇఎ అనుమతితో తమ విభాగం 30 మార్చి 2020 తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా సవరించిన ఎన్‌పిఎస్ -3లోని సందేహాలను తొలగించడం జరిగింది. దీనివల్ల 30 యూరియా యూనిట్లకు మెట్రిక్ టన్నుకు 350 రూపాయల వంతున అదనపు స్థిర ధరను మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే 30 సంవత్సరాలకు పైబడినదై ఉండి గ్యాస్ కు మారిన యూరియా యూనిట్లకు మెట్రిక్ టన్నుకు రూ 150 వంతున ప్రత్యేక పరిహారం మంజూరు చేస్తారు. ఇది ఆ యూనిట్ల నిరంతర ఉత్పత్తికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఫలితంగా రైతులకు యూరియా క్రమబద్ధమైన, నిరంతర సరఫరాకు వీలు కలుగుతుంది.
*******
(Release ID: 1641183)
Visitor Counter : 217