వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇండియా,యూకె. ఉమ్మడి నిబద్ధత , ఆ దిశగా దశలవారీగా సత్వర ఒప్పందాలు.
Posted On:
25 JUL 2020 9:54AM by PIB Hyderabad
ఇండియా , యు.కెలు 2020 జూలై 24న సంయుక్త ఆర్థిక , వాణిజ్య కమిటీ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించాయి. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ , యుకె అంతర్జాతీయ వాణిజ్య మంత్రి శ్రీమతి ఎలిజబెత్ ట్రస్ తో కలసి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. వీరికి కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ హరద్దీప్ సింగ్ పూరి, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయ మంత్రి రణిల్ జయవర్దెన సహకరించారు.
కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్, యుకె మంత్రి శ్రీమతి ట్రస్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి .అలాగే దశల వారీగా త్వరగా ఒప్పందాలు కుదుర్చకునే దిశగా తమ ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు కేంద్ర సహాయమంత్రి శ్రీహర్దీప్ సింగ్ పూరి, బ్రిటన్ సహాయమంత్రి జయవర్ధనెలు నెల వారీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, యుకె కేంద్ర మంత్రి ట్రస్ నేతృత్వంలో 2020 శరత్కాలంలో కొత్తఢిల్లీలో సమావేశం జరగనుంది. జీవశాస్త్రాలు, ఆరోగ్యం, ఐసిటి, ఫుడ్, డ్రింక్ వంటి వాటిపై గత జెఇటిసిఒ ఏర్పాటు చేసిన కో ఛెయిర్స్ ఆఫ్ బిజినెస్ నాయకత్వంలోని సంయుక్త వర్కింగ్ గ్రూప్‌లు తమ సిఫార్సులను మంత్రులకు సమర్పించాయి.
అధికారిక చర్చల అనంతరం ప్లీనరీ సెషన్ జరిగింది.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, యుకె అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయమంత్రి రణిల్ జయవర్ధనే, యుకె పెట్టుబడుల శాఖ సహాయమంత్రి గెర్రి గ్రిమ్‌స్టొన్‌ల నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో వ్యాపార నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో సిఐఐ,డిజి చంద్రజిత్ బెనర్జీ, ఇండియా యూకె సిఇఒ ఫోరం సహ అధ్యక్షుడు శ్రీ అజయ్ పిరమల్ ఉన్నారు.
ఇరుపక్షాలూ ఎలాంటి అరమరికలు లేకుండా చర్చలు జరిపాయి. ఇండియా-యుకె ల మధ్య ఎంతో కాలంగా ఉన్న వాణిజ్య, ఆర్థిక బంధాలను పునరుద్ధరించడంతోపాటు వాటిని మరింత బలోపేతం చేయాలని అందుకు ఉభయ పక్షాలకు గల నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య రంగంలో సహకరించుకోవాలని ఇరు పక్షాలూ తీర్మానించాయి.
*****
(Release ID: 1641151)
Visitor Counter : 263