ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వరుసగా మూడవ రోజున అత్యధిక సింగిల్ డే రికవరీ నమోదయ్యింది; గత 24 గంటల్లో 34,602 మంది కోవిడ్ రోగులు డిశ్చార్జ్ అయ్యారు.
ఇంతవరకు మొత్తం కోలుకున్న కోవిడ్ రోగుల సంఖ్య 8 లక్షలు దాటింది.
కేసు మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఇది 2.38 శాతంగా ఉంది.
Posted On:
24 JUL 2020 3:26PM by PIB Hyderabad
కోవిడ్-19 రోగుల యొక్క అత్యధిక సింగిల్ డే రికవరీల ధోరణి నిరంతరాయంగా కొనసాగుతోంది. వరుసగా మూడవ రోజు, గత 24 గంటల్లో, 34,602 మంది రోగులు కోలుకోవడంతో మరో అత్యధిక రికార్డు నమోదైంది. దీంతో ఇంతవరకు మొత్తం కోలుకున్న కోవిడ్ రోగుల సంఖ్య 8 లక్షలు దాటి, ప్రస్తుతం 8,17,208 కి చేరుకుంది. కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 63.45 శాతానికి చేరుకోవడానికి ఇది బలంగా తోడ్పడింది.
ఫలితంగా, కోలుకుంటున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు మరియు చికిత్స అనంతరం కోలుకున్న వ్యక్తులు(ఈ రోజు 4,40,135) మధ్య వ్యత్యాసం మరింత విస్తరించి 3,77,073 గా నమోదయ్యింది. ఈ వ్యత్యాసం క్రమంగా పైకి పెరుగుతున్న ధోరణి కనబడుతోంది.
రాష్ట్ర మరియు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వ్యూహాత్మక చర్చల ద్వారా, ఎక్కువ కేసులు నమోదౌతున్న ప్రాంతాలకు పంపిన నిపుణుల కేంద్ర బృందాల ద్వారా, రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రయత్నాలు మరింతగా బలపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికుల అంకితభావంతో, రికవరీలు మెరుగుపడుతున్నాయి మరియు కేసు మరణాలు నిరంతరం పడిపోతున్నాయి, ప్రస్తుతం ఇది 2.38 శాతం గా నమోదయ్యింది.
కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు చక్కగా రూపొందించి, అమలు చేసిన వ్యూహం, రికవరీల సంఖ్య నిరంతరం పెరగడానికి దోహదపడుతోంది. ఇంటింటి సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎస్.ఏ.ఆర్.ఐ. / ఐ.ఎల్.ఐ. కేసుల పర్యవేక్షణతో పాటు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తుగా వ్యాధిని గుర్తించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతోంది. మూడు అంచెల ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులలో ప్రామాణిక వైద్య విధానాలు అమలుచేయడం, సమర్ధవంతమైన కట్టడి ప్రణాళికలు, సమర్థవంతమైన చికిత్స విధానాలు కూడా వీటికి తోడ్పడుతున్నాయి. ఇళ్ళల్లో ఐసోలేషన్ మరియు ఆసుపత్రులలో సమర్థవంతంగా చికిత్స చేయడంలో ఇవి విజయవంతంగా సహాయపడుతున్నాయి, తద్వారా క్లిష్టమైన రోగులకు ఆస్పత్రులు భారం కాకుండా ఉంటాయి. .
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,
సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం
ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను
దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా,
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046
లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన
కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
(Release ID: 1641010)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam