శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నోవెల్ ఎంఆర్ఎన్ఎ ఆధారిత కోవిడ్ 19 వ్యాక్సిన్ కాండిడేట్- హెచ్ జి సి ఓ 19 రూపొందించడానికి బయోటెక్నాలజీ విభాగం జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కోసం సీడ్ ఫండింగ్ (ప్రారంభ నిధి)ని అందిస్తుంది

ఈ సంవత్సరాంతానికి క్లినికల్ ట్రయిల్ కి వెళ్లనున్న వాక్సిన్

ఇండ్ సిఈపిఐ కింద కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం సహకారంతో వాక్సిన్ ఆవిష్కార కార్యక్రమం కింద బిఐఆర్ఏసి అభివృద్ధి చేసిన వాక్సిన్ త్వరలో క్లినికల్ ట్రయిల్స్

Posted On: 24 JUL 2020 12:27PM by PIB Hyderabad

భారతదేశంలో ‘ఇటువంటి రకంలో మొదటిది’ అయిన ఎంఆర్ఎన్ఎ - ఆధారిత వ్యాక్సిన్ తయారీ వేదికను  డిబిటి- బిఐఆర్ఏసి ఏర్పాటు చేయడానికి దోహదపడింది. కోవిడ్19 కోసం జెన్నోవా  నొవెల్ స్వీయ-విస్తరణ ఎంఆర్ఎన్ఎ - ఆధారిత వ్యాక్సిన్ కాండిడేట్ అభివృద్ధికి డిబిటి ప్రారంభ నిధిని అందించింది.

అమెరికాలోని సీటెల్‌లోని హెచ్‌డిటి బయోటెక్ కార్పొరేషన్ సహకారంతో, ఎలుకల మరియు నాన్-హ్యూమన్ ప్రైమేట్ మోడళ్లలో ప్రదర్శించిన భద్రత, రోగనిరోధక శక్తి, తటస్థీకరణ యాంటీబాడీ కార్యకలాపాలతో జెన్నోవా ఒక  ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ కాండిడేట్ ( హెచ్ జి సి ఓ 19) అభివృద్ధి చేసింది. భారతీయ నియంత్రణ ఆమోదాలకు లోబడి, ఈ సంవత్సరం చివరినాటికి మొదటి మానవ ఇంజెక్షన్ ఉండేలా కంపెనీ చురుకుగా పనిచేస్తోంది.

డిబిటి కార్యదర్శి, బిఐఆర్ఏసి చైర్‌పర్సన్ డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ “తెలియని, కొత్త వ్యాధికారక కారకాల నుండి వెలువడే వ్యాధులు సమర్థవంతమైన నివారణకు కొత్త ఆలోచనలు అవసరం. డిబిటి మద్దతు ఇచ్చిన జెన్నోవా  ఎం-ఆర్ఎన్ఎ   ప్లాట్‌ఫాం న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్, డెలివరీ సిస్టమ్స్‌లో మార్పులను ఉపయోగించుకుంటుంది. నానోటెక్నాలజీని ఉపయోగించుకునే ఈ టీకా కాండిడేట్ జంతు నమూనాలలో ప్రభావవంతంగా ఉంటుందని హామీ ఇస్తోంది. ఒకసారి మానవ క్లినికల్ ట్రయల్స్‌లో ఇది సమర్థవంతంగా నిరూపితమైతే జెన్నోవాకు ఉన్న సామర్థ్యాలతో, ఈ టీకా కాండిడేట్ ను వేగంగా అమలులోకి తేవచ్చని నాకు నమ్మకం ఉంది" అని అన్నారు. 

జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సిఇఒ డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ “ప్రపంచవ్యాప్తంగా పోటీ, స్థిరమైన పరిష్కారాలను రూపొందించడానికి ధైర్యమైన చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కొత్త తరం వ్యాక్సిన్ అభివృద్ధికి  డిబిటి-బిఐఆర్ఏసి చొరవ, మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయాన్ని జెన్నోవా ప్రశంసించింది. మా భాగస్వామ్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి, కోవిడ్-19 వంటి మహమ్మారి పరిస్థితుల్లో ప్రజలకు చేరువయ్యే తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్‌ను తయారుచేసే దిశగా పరిష్కారాన్ని అందిస్తుంది” అని అన్నారు. 

 

 
 
 

(Release ID: 1640927) Visitor Counter : 303