రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌త వైమానిక ద‌ళ కమాండ‌ర్ల స‌ద‌స్సు-జూలై 2020

Posted On: 22 JUL 2020 1:28PM by PIB Hyderabad

వైమానిక ద‌ళ క‌మాండ‌ర్ల స‌ద‌స్సు(ఎఫ్ సిసి)ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2020 జూలై 22 వ తేదీన వైమానిక కేంద్ర కార్యాల‌యం (వాయు భ‌వ‌న్)లో ప్రారంభించారు. వైమానిక ద‌ళాధిప‌తి , ఎయిర్ ఛీఫ్ మార్ష‌ల్ ఆర్‌.కె.ఎస్ భ‌ధౌరియా, కేంద్ర ర‌క్ష‌ణ మంత్రికి, ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌కు స్వాగ‌తం ప‌లికారు.
వైమానిక ద‌ళ క‌మాండ‌ర్ల‌నుద్దేశించి మాట్లాడుతూ ర‌క్ష‌ణ మంత్రి, గ‌త కొద్దినెల‌ల్లో ఐఎఎఫ్ త‌న నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యాల‌ను పెంచుకోవ‌డంలో చూపిన స్పంద‌న‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. బాగ‌ల్ కోట్‌లో అత్యంత స‌మ‌ర్దంగా నిర్వ‌హించిన వైమానిక దాడులు , ప్ర‌స్తుతం తూర్పు ల‌ద్దాక్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో  ఫార్వ‌ర్డ్ లొకేష‌న్ల‌లో స‌త్వ‌రం ఐఎఎఫ్ సాధ‌న‌సంప‌త్తిని  రంగంలోకి దింప‌డం  వంటివి విరోధుల‌కు బ‌ల‌మైన సంకేతాన్ని పంపాయ‌ని ఆయ‌న అన్నారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు దేశం చెప్పుకునే సంక‌ల్పం , త‌మ సాయుధ బ‌ల‌గాల సామ‌ర్ధ్యం‌పై ఆ దేశ ప్ర‌జ‌ల‌కు  గ‌ల విశ్వాసంపై గ‌ట్టిగా నిల‌బ‌డి  ఉంటుంద‌ని ఆయ‌న‌ అన్నారు.  వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ల స‌డ‌లింపున‌కు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల్సిందిగా ఆయ‌న వారికి పిలుపునిచ్చారు.

 కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు దేశం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఐఎఎఫ్ అద్భుతంగా మ‌ద్ద‌తు నిచ్చింద‌ని ఆయ‌న కొనియాడారు. హెచ్‌.ఎ.డి.ఆర్ కార్య‌క‌లాపాల‌లో ఎఐఎఫ్ పాత్ర‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. రక్ష‌ణ ఉత్ప‌త్తి రంగంలో స్వావ‌లంబ‌న సాధించాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.ప్ర‌స్తుత ఎ.ఎఫ్‌.సి.సికి ఎంచుకున్నఅంశం- ‘ రాగ‌ల ద‌శాబ్దంలో ఐఎఎఫ్‌’ , ఎంతో స‌రైనద‌ని, రాగ‌ల రోజుల‌లో దేశీయ‌త దిశ‌గా సాగించే కృషిని ఇది మ‌రింత పెంపొందిస్తుంద‌ని అన్నారు. సిడిఎస్  నియామ‌కం, డిఎంఎ ఏర్పాటు అనంత‌రం త్రివిధ ద‌ళాల‌మ‌ద్య మ‌రింత స‌మ‌న్వ‌యం, స‌మ‌గ్ర‌త పెరిగే దిశ‌గా జ‌రి‌గిన పురోగ‌తిని ఆయ‌న కొనియాడారు.

సాంకేతిక‌త‌లో మార్పులు, నానోటెక్నాల‌జీ వంటి వినూత్న సామ‌ర్ద్యాలు, కృత్రిమ మేధ‌, సైబ‌ర్‌, అంత‌రిక్ష రంగాల‌లో ,మార్పుల‌ను అందిపుచ్చుకోవ‌డంలో ఐఎఎఫ్ పాత్ర‌ను ర‌‌క్ష‌ణ మంత్రి  ప్ర‌స్తావించారు. సాయుధ ద‌ళాల‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక లేదా ఇత‌ర అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చ‌డం జ‌రుగుతుంద‌ని ర‌క్ష‌ణ‌మంత్రి , క‌మాండ‌ర్ల‌కు హామీ ఇచ్చారు.
వైమానిక ద‌ళాధిప‌తి, క‌మాండ‌ర్ల‌నుద్దేశించి మాట్లాడుతూ, స్వ‌ల్ప‌కాలిక‌,వ్యూహాత్మ‌క ముప్పుల‌ను ఎదుర్కోవ‌డంలో ఐఎఎఫ్ స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉంద‌ని , విరోధులు ఎలాంటి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డినా దానిని తిప్పి కొట్టేందుకు స‌ర్వ‌స‌మ‌ర్ధంగా ఉంద‌న్నారు. బ‌ల‌గాల స‌న్న‌ద్ధ‌త , మోహ‌రింపు విష‌యంలో అన్ని క‌మాండ్‌లు, స‌‌త్వ‌ర ప్ర‌తిస్పంద‌న‌ను క‌లిగి ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు.  అద్భుత ప్ర‌తిస్పంద‌న‌కుప వీలుగా ,స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ప‌రిస్థితుల‌ను ఎదుర్కోగ‌ల స‌మ‌ర్ధ‌త‌పై దృష్టిపెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌న్నారు
 
 ఈ మూడు రోజుల స‌ద‌స్సులో క‌మాండ‌ర్లు, రానున్న ద‌శాబ్దంలో ఏర్ప‌డ‌గల అన్ని ర‌కాల ముప్పుల‌ను ఎదుర్కోవ‌డానికి ఐఎఎఫ్ సామ‌ర్ద్యాల‌పెంపుపై చ‌ర్చించ‌డానికి ముందు , ప్ర‌స్తుత కార్యాచ‌ర‌ణ ప‌రిస్థితులు‌, బ‌ల‌గాల మొహ‌రింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష నిర్వహిస్తారు.

***



(Release ID: 1640465) Visitor Counter : 213