రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టుకు సంబంధించి దరఖాస్తు దాఖలుకు ముందస్తు సమావేశం ఈరోజు జరిగింది.
దరఖాస్తు చేయదలచిన 16 మంది ఈ సమావేశానికి హాజరు.
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నడవనున్న రైళ్లు
ఈ చర్య నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడంతోపాటు , రాబడి , ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
ఇప్పటికే నడుస్తున్న రైళ్ళకు ఈ 151 రైళ్ళు అదనం
భవిష్యత్ దరఖాస్తుదారులు ప్రస్తావించిన అంశాలు, వ్యక్తం చేసిన ఆందోళనలపై చర్చ
. ఆర్.ఎఫ్.క్యు, బిడ్డింగ్ ఫ్రేమ్ వర్క్ ప్రొవిజన్లకు సంబంధించి మరింత మెరుగైన స్పష్టతనిచ్చేందుకు వివరణ నిచ్చిన రైల్వే మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్ అధికారులు .
రైళ్ళను నడపడంలో ఎక్కువమంది ఆపరేటర్లు ఉండడం వల్ల పోటీకి , మెరుగైన సేవలకు ఇది దారితీస్తుంది.
Posted On:
21 JUL 2020 6:26PM by PIB Hyderabad
ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వశాఖ భావి దరఖాస్తు దారులతో ఈరోజుముందస్తు సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి మంచి స్పందన లభించింది . సుమారు 16 మంది ఆసక్తిగల దరఖాస్తుదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
దేశంలో కొత్తగా 151 అధునాతన రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా 109 కి పైగా ప్రారంభ , గమ్యస్థాన జంట రైళ్ళను నడపడానికి ప్రైవేటు సంస్థలు పాల్గొనేందుకు12 అభ్యర్థనలను అర్హత కోసం రైల్వే మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. ప్రస్తుతం నడుస్తున్న రైలు నెట్ వర్క్ కు ఇవి అదనం.
భారతీయ రైల్వే నెట్ వర్క్‌లో ప్రయాణికుల రైళ్ళు నడపడానికి ప్రైవేటు పెట్టుబడుల కోసం చేపట్టిన తొలి చ ర్య ఇది. ప్రైవేటు రంగం పెట్టుబడులు 30,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టు ద్వారా సమకూరే అవకాశం ఉంది.
దేశప్రజలకు రవాణాసదుపాయాల అందుబాటును మరింత మెరుగు పరిచే దిశగా ఈ చర్య తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అధునాతన సేవలు అందుబాటులోకి రావడం వంటి వాటి వల్ల మొత్తంగా ప్రయాణికుల ప్రయాణ అనుభవం మెరుగుపడనుంది. రైళ్లను నడపడంలో బహుళ ఆపరేటర్లు ఉండడం వల్ల అది పోటీకి దారితీసి , మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపకరిస్తుంది. అలాగే ప్రయాణికుల రవాణా రంగంలో డిమాండ్ ,సరఫరా లోటును తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కాంపిటిటివ్ బిడ్డింగ్ ద్వారా రెండు దశలలో జరుగుతుంది. ఇందులో ఒకటి అర్హతకు అభ్యర్థన (ఆర్.ఎప్.క్యు), మరొకటి ప్రతిపాదనకు అభ్యర్థన (ఆర్.ఎఫ్.పి)
బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా, రైల్వే మంత్రిత్వశాఖ తొలి ప్రీ అప్లికేషన్ కాన్ఫరెన్సును జూలై 21,2020న నిర్వహించంది.దీనికి మంచి స్పందన వచ్చింది. సమారు 16 మంది భవిష్యత్ దరఖాస్తుదారులు ఇందులో పాల్గొన్నారు. ఈ భావి దరఖాస్తు దారులు లేవనెత్తిన అంశాలు, వారు వ్యక్తం చేసిన ఆందోళనకు సంబంధించి న అంశాలు చర్చించి వారికి అవసరమైన వివరణలను రైల్వే మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్ అధికారులు తెలియజేయడం జరిగింది. ఆర్.ఎఫ్.క్యు , బిడ్డింగ్ ఫ్రేమ్ వర్క్‌కు చెందిన నిబంధనలపై మరింత స్పష్టత నిచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అర్హతా ప్రమాణాలు, బిడ్ ప్రక్రియ, రేక్‌లను సమకూర్చుకోవడం, రైళ్ల నిర్వహణ,క్లస్టర్ కాంపోజిషన్ వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
రైల్వే మౌలిక సదుపాయాలు వినియోగించుకున్నందుకు చెల్లించాల్సిన చార్జీలకు సంబంధించి వచ్చిన ప్రశ్నలకు రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానాలిచ్చింది. ఈ చార్జీలను ముందుగానే తెలియజేయడం జరుగుతుందని, మొత్తం రాయితీ కాలానికి తగినట్టుగా నిర్ణయించడం వల్ల ఈ చార్జీలలో ఒక స్థిరత్వం ఉంటుందని తెలిపింది.
ఒప్పందానికి సంబంధించి న మార్గాలలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అందజేయనుంది. ఇది బిడ్డర్లు ప్రాజెక్టులో తగిన శ్రద్ధ వహించడానికి వీలు కల్పిస్తుంది
ఈ ప్రాజెక్టు కింద నడిపే రైళ్లను కొనుగోలు చేయడం కానీ లేదా ప్రైవేటు సంస్థలు లీజుకు కానీ తీసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. రైళ్ల నిర్వహణకు సంబంధించిన నష్టాలను పార్టీలకు సమానంగా కేటాయించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
జూలై 31, 2020 నాటికి దరఖాస్తుదారులు కాబోయేవారి నుండి వచ్చిన ప్రశ్నలకు రైల్వే మంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానాలు ఇవ్వనుంది. రెండవ ముందస్తు దరఖాస్తుదారుల సమావేశం 2020 ఆగస్టు12 న జరగనుంది.
***
(Release ID: 1640399)
Visitor Counter : 260