ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్రకారం 19 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు రోజుకు, మిలియన్ జనాభాకు 140 పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల రేటు 8.07 శాతంగా ఉంది.

30 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పాజిటివ్ కేసుల రేటు భారతదేశ సగటు కంటే తక్కువగా ఉంది.

Posted On: 21 JUL 2020 7:38PM by PIB Hyderabad

"టెస్ట్, ట్రాక్, ట్రీట్" అంటే పరీక్షించడం, వ్యాప్తిని గుర్తించడం, చికిత్సనందించడం అనే వ్యహం కోవిడ్-19 కట్టడి చేసే మొత్తం ప్రణాళికను ముందుకు తీసుకువెళ్తోంది.   కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో, రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ ప్రణాళికను వివిధ చర్యల ద్వారా అమలు చేస్తున్నాయి.  రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు ఒక పక్క తమ పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతూనే, మరోపక్క ప్రజలు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయించుకునే విధంగా విస్తృతంగా చర్యలను కూడా చేపట్టారు. ఫలితంగా, జాతీయ స్థాయిలో రోజుకు, మిలియన్ మందికి, సగటు పరీక్షలు గణనీయంగా ఈ రోజుకు 180 కి పెరిగింది.

“కోవిడ్-19 సందర్భంలో ప్రజారోగ్యం మరియు సామాజిక చర్యలను సర్దుబాటు చేయడానికి ప్రజారోగ్య ప్రమాణాలు” అనే అంశంపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ తన మార్గదర్శకాలు విడుదల చేస్తూ, అనుమానాస్పద కోవిద్-19 కేసుల కోసం సమగ్ర నిఘా అవసరమని సూచించింది.  ఏదైనా ఒక దేశంలో మిలియన్ జనాభాకు, రోజుకు 140 పరీక్షలు చేయవలసిన అవసరం ఉందని కూడా సూచించింది. 

 

Combined Final 21st July Press Brief.jpg

ప్రస్తుతం భారతదేశంలోని 19 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు మిలియన్ జనాభాకు, రోజుకు, 140 కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.  కాగా, గోవా రాష్ట్రం మిలియన్ జనాభాకు, రోజుకు, అత్యధికంగా, 1,333 పరీక్షలను చేస్తోంది. 

నిర్వహించవలసిన పరీక్షల సంఖ్యను పెంచాలని, కేంద్రప్రభుత్వం మరియు ఐ.సి.ఎం.ఆర్. నిరంతరం రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.  ఈ విధమైన సమన్వయ ప్రయత్నాల ద్వారా, భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు పరీక్షల సగటు (టి.పి.ఎం) 10,421 కి పెరిగింది. కోవిడ్-19 కేసులను ముందుగా గుర్తించడంతో పాటు, సకాలంలో, సమర్థవంతమైన చికిత్సనందించడానికి ఇది సహాయపడింది.

Combined Final 21st July Press Brief 1.jpg

పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగడంతో, భారతదేశంలో ధృవీకరణ రేటు లేదా పాజిటివ్ కేసుల నిరంతరం తగ్గుతోంది.  ప్రస్తుతం ఇది 8.07 శాతంగా ఉంది.  భారతదేశంలోని 30 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు భారత సగటు కంటే తక్కువ పాజిటివ్ కేసుల రేటును కలిగి ఉన్నాయి. పరీక్షల సంఖ్య ను పెంచడంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే, ఈ సానుకూల ఫలితాలను సాధించడానికి అవకాశం ఏర్పడిందన్న విషయాన్ని ఇది సూచిస్తోంది.  

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న మెయిల్ ను సంప్రదించడంద్వారా పొందవచ్చు 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ :  +91-11-23978046  లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం వెబ్ సైట్ ని చూడండి :  

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****



(Release ID: 1640317) Visitor Counter : 215