హోం మంత్రిత్వ శాఖ

మేఘాలయ పశ్చిమ గారో కొండల్లో వరదల కారణంగా అనేక మంది చనిపోవడంపై కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా సంతాపం

మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మాతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని అభయం
ఈ కష్టకాలంలో దేశమంతా మేఘాలయ ప్రజలకు అండగా ఉందని వ్యాఖ్యానించిన అమిత్‌ షా

प्रविष्टि तिथि: 21 JUL 2020 2:45PM by PIB Hyderabad

మేఘాలయలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర పశ్చిమ గారో కొండల్లో పోటెత్తిన వరదల కారణంగా అనేక మంది చనిపోవడంపై కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మాతో తాను మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని అభయం ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి ట్వీట్‌ చేశారు. 

    ఈ కష్టకాలంలో దేశమంతా మేఘాలయ ప్రజలకు అండగా ఉందని ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1640220) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam