రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

బుధవారం నుంచి భారత వైమానిక దళ కమాండర్ల సమావేశం

Posted On: 20 JUL 2020 8:07PM by PIB Hyderabad

ఈనెల 22, 23, 24 తేదీల్లో భారత వైమానిక దళ కమాండర్ల సమావేశం (ఏఎఫ్‌సీసీ) జరగనుంది. వైమానిక దళ ప్రధాన కార్యాలయమైన, దిల్లీలోని "వాయుభవన్‌"లో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశ అంశం.. "వచ్చే దశాబ్దంలో భారత వైమానిక దళం". రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ ఉత్పత్తుల కార్యదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నారు.

    ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భాదురియా ఏఎఫ్‌సీసీకి అధ్యక్షత వహిస్తారు. వైమానిక దళ ప్రస్తుత కార్యాచరణ, మోహరింపులపై చర్చలు జరుగుతాయి. వచ్చే దశాబ్దంలో ఐఏఎఫ్‌ కార్యకలాపాల సామర్థ్య పెంపు కోసం కార్యాచరణ ప్రణాళికపైనా సమాలోచనలు చేస్తారు.

***


(Release ID: 1640069) Visitor Counter : 124