రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశ‌వ్యాప్తంగా సంతృప్తిక‌రంగా ఎరువుల‌ ల‌భ్య‌త‌: కేంద్ర మంత్రి శ్రీ డి.వి. స‌దానంద‌గౌడ‌

తెలంగాణాలో యూరియా అందుబాటుపై కేంద్ర మంత్రి శ్రీ డి.వి.స‌దానంద గౌడ‌ను క‌లిసిన , తెలంగాణా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి.

Posted On: 20 JUL 2020 4:19PM by PIB Hyderabad

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్ లో దేశ‌వ్యాప్తంగా ఎరువుల‌కు డిమాండ్ పెరిగిన‌ట్టు కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.స‌దానంద గౌడ తెలిపారు. ఈ అవ‌స‌రానికి త‌గిన‌ట్టుగా ఉత్ప‌త్తిదారులు, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌తో స‌న్నిహిత స‌హ‌కారంతో ప‌నిచేస్తున్నామ‌ని స‌దానంద‌గౌడ తెలిపారు.

 


దీనికితోడు డిమాండ్‌కు త‌గిన‌ట్టుగా స‌ర‌ఫ‌రాను పెంచ‌డానికి దిగుమ‌తుల సైకిల్‌ను కుదించిన‌ట్టు కూడా  మంత్రి చెప్పారు.
తెలంగాణారాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, రాష్ట్రంలో యూరియా డిమాండ్ కు సంబంధించి కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.స‌దానంద‌గౌడ‌ను క‌లిశారు. ఈ సారి రుతుప‌వ‌నాలు ఊహించిన‌దానికంటే మెరుగ్గా ఉండ‌డంతో రాష్ట్రంలో రైతుల యూరియా వాడ‌కం, డిమాండ్ లోపెరుగుద‌ల క‌నిపించింద‌ని చెప్పారు. అలాగే గ‌త ఏడాది కంటే ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్లో సాగు విస్తీర్ణం పెరిగింద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణాకు స‌రిపడినంత యూరియా స‌ర‌ఫ‌రా చేయాల్సిందిగా ఆయ‌న కేంద్ర‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.
ఈ విష‌య‌మై స్పందిస్తూ శ్రీ డి.వి.స‌దానంద‌గౌడ‌, దేశ‌వ్యాప్తంగా ఎరువులు సంతృప్తిక‌ర స్ధాయిలో అందుబాటులో ఉన్నాయ‌ని, రాష్ట్రాల వ‌ద్ద త‌గిన‌న్ని నిల్వ‌లు ఉ న్నాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుత నాట్ల కాలంలో  ఇంకా ఏవైనా అద‌న‌పు డిమాండ్ ఉంటే స‌ర‌ఫ‌రాను వేగ‌వంతం చేస్తామ‌ని అన్నారు. స‌కాలంలో రైతుల‌కు యూరియా అందుబాటులో ఉండేలా చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

*****


(Release ID: 1639986) Visitor Counter : 213