ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నుండి 7 లక్షల మందికి పైగా వ్యక్తులు కోలుకున్నారు
భారతదేశం ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటు 2.46 శాతం ను కలిగి ఉంది
Posted On:
20 JUL 2020 2:44PM by PIB Hyderabad
దేశంలో కేసు మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు ఇది 2.46 శాతానికి తగ్గింది. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే అతి తక్కువ కేసు మరణాల రేటు భారతదేశంలో ఉంది. తీవ్రమైన కేసులతో పాటు, ఓ మాదిరి తీవ్రత కలిగిన కేసులకు కూడా ప్రామాణికమైన, సమర్థవంతమైన చికిత్సను అందించడం ద్వారా కోవిడ్ రోగులలో అధిక రికవరీ రేటును సాధించడానికి అవకాశం ఏర్పడింది. కోవిడ్-19 ను సమిష్టిగా ఎదుర్కోవడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలకు తగిన చేయూతనిచ్చి, సహకరిస్తోంది. అలాంటి ఒక ప్రయత్నమే, న్యూఢిల్లీ ఎయిమ్స్ లో అమలుచేస్తున్న ఈ-ఐ.సి.యు. కార్యక్రమం. మరణాలను తగ్గించే లక్ష్యంతో, 11 రాష్ట్రాల్లోని 43 పెద్ద ఆసుపత్రులకు ఐ.సి.యు. రోగుల క్లినికల్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్య అనుభవాలను, దేశీయ నిపుణుల సాంకేతిక సలహాలను అందజేయడం ద్వారా ఎయిమ్స్ మార్గదర్శకత్వం మరియు మద్దతును సమకూరుస్తోంది. క్లిష్టమైన సంరక్షణ అవసరమైన రోగుల చికిత్సలో ఇది వారి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
ఇంతవరకు, దాదాపు 7 లక్షలకు పైగా కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు మరియు చికిత్స అనంతరం కోలుకున్న వ్యక్తులు (7,00,086) మధ్య వ్యత్యాసం మరింత విస్తరించి 3,09,627 గా నమోదయ్యింది. గత 24 గంటల్లో 22,664 మంది కోవిడ్ రోగులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 62.62 శాతంగా ఉంది.
3,90,459 క్రియాశీల కేసులకు, ఆసుపత్రులలోనూ లేదా ఇంటి వద్ద ఐసోలేషన్ లో వారికి వైద్య సహాయం అందిస్తున్నారు.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
(Release ID: 1639944)
Visitor Counter : 278
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam