ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశం యొక్క కేసు మరణాల రేటు (సి.ఎఎఫ్.ఆర్) మొదటిసారి 2.5 శాతం కంటే తక్కువగా ఉంది.
29 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన - సి.ఎఫ్.ఆర్.
Posted On:
19 JUL 2020 1:40PM by PIB Hyderabad
ఆసుపత్రిలో చేరిన కేసుల సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల దృష్టి కేంద్రీ కృత ప్రయత్నాలు భారతదేశం యొక్క కేసు మరణాల రేటు 2.5 శాతం కన్నా తక్కువకు పడిపోవడానికి దోహదం చేశాయి. సంపూర్ణ ప్రామాణిక సంరక్షణ విధానం ఆధారంగా సమర్థవంతమైన కంటెయిన్‌మెంట్ వ్యూహం, శక్తివంతమైన పరీక్షలు, ప్రామాణిక వైద్య నిర్వహణలతో, కేసు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. కేసు మరణాల రేటు క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం 2.49 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యల్ప మరణాల రేటు నమోదవుతున్న దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్రం మార్గదర్శకత్వంలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ప్రయత్నాలను సమన్వయ పరచడం ద్వారా పరీక్ష మరియు ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచాయి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలతో పాటు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న జనాభాను గుర్తించడానికి అనేక రాష్ట్రాలు జనాభా సర్వేలను నిర్వహించాయి. వివిధ రకాల మొబైల్ యాప్ లు వంటి సాంకేతిక పరిష్కారాల సహాయంతో, అధిక-ప్రమాదం ఉన్న జనాభాను నిరంతర పరిశీలనలో ఉంచడానికీ, అనారోగ్యాలను ముందస్తుగా గుర్తించడానికీ, సకాలంలో తగిన వైద్య చికిత్స అందించడానికీ, తద్వారా మరణాలను తగ్గించదానికీ ఈ సర్వేలు ఉపయోగపడ్డాయి. క్షేత్ర స్థాయిలో, ఆశా కార్మికులు, ఏ.ఎన్.ఎమ్. లు వంటి ముందు వరుసలో ఉండే ఆరోగ్య కార్యకర్తలు వలస జనాభాను గుర్తించి, వారికి సమాజ స్థాయిలో అవగాహన పెంచడం చాలా ప్రశంసనీయం.
ఫలితంగా, 29 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు భారత సగటు కంటే తక్కువ సి.ఎఫ్.ఆర్. ను నమోదుచేశాయి.
5 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో సి.ఎఫ్. ఆర్. సున్నా గా నమోదయ్యింది.
14 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో సి.ఎఫ్.ఆర్. ఒక శాతం కన్నా తక్కువగా ఉంది.
ఇది దేశ ప్రజారోగ్య యంత్రాంగం నిర్వహించిన ప్రశంసనీయమైన కృషికి నిదర్శనంగా నిలిచింది.
రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం పేరు
|
కేసు మరణాల రేటు (శాతం)
|
రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం పేరు
|
కేసు మరణాల రేటు (శాతం)
|
మణిపూర్
|
0.00
|
హిమాచల్ ప్రదేశ్
|
0.75
|
నాగాలాండ్
|
0.00
|
బీహార్
|
0.83
|
సిక్కిం
|
0.00
|
ఝార్ఖండ్
|
0.86
|
మిజోరాం
|
0.00
|
తెలంగాణ
|
0.93
|
అండమాన్ & నికోబార్ దీవులు
|
0.00
|
ఉత్తరాఖండ్
|
1.22
|
లడాఖ్ (యు.టి)
|
0.09
|
ఆంధ్రప్రదేశ్
|
1.31
|
త్రిపుర
|
0.19
|
హర్యానా
|
1.35
|
అస్సాం
|
0.23
|
తమిళనాడు
|
1.45
|
దాద్రా, నగర్ హవేలీ, డామన్ & డయ్యు
|
0.33
|
పుదుచ్చేరి
|
1.48
|
కేరళ
|
0.34
|
చండీగఢ్
|
1.71
|
ఛత్తీస్ గఢ్
|
0.46
|
జమ్మూ, కాశ్మీర్
(యు.టి)
|
1.79
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.46
|
రాజస్థాన్
|
1.94
|
మేఘాలయ
|
0.48
|
కర్ణాటక
|
2.08
|
ఒడిశా
|
0.51
|
ఉత్తరప్రదేశ్
|
2.36
|
గోవా
|
0.60
|
|
|
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1639825)
Visitor Counter : 305
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam