మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 99.23 శాతం ఉత్తీర్ణత సాధించిన సంస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన - కేంద్రీయ విద్యాలయ సంగథన్

Posted On: 16 JUL 2020 5:40PM by PIB Hyderabad

సి.బి.ఎస్.ఈ. పదవ తరగతి ఫలితాలు - 2020 లో మొత్తం సి.బి.ఎస్.ఈ. ఉత్తీర్ణత 91.46 శాతం కాగా, కేంద్రీయ విద్యాలయ సంగథన్ 99.23 శాతం ఉతీర్ణత సాధించింది.  కె.వి.ఎస్. వరుసగా రెండవ సంవత్సరం అన్ని సంస్థల విభాగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 

కె.వి.ఎస్. ఫలితాల ముఖ్యాంశాలు :

*     కె.వి.ఎస్. నుండి హాజరైన మొత్తం విద్యార్థులు:     94498

*     ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థులు                        :     93774

*     మొత్తం మీద ఉత్తీర్ణతా శాతం                            :      99.23

*     ఉత్తీర్ణులైన మొత్తం బాలుర సంఖ్య                  :      50591

*     ఉత్తీర్ణులైన మొత్తం బాలికల సంఖ్య                 :      43183

*     మొత్తం కేంద్రీయ విద్యాలయాల సంఖ్య          :      1168

*     100 శాతం ఉతీర్ణత సాధించిన కె.వి. లు            :       846

90 శాతం, 95 శాతం మరియు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల మొత్తం సంఖ్య:

 

90 శాతం, అంతకంటే ఎక్కువ 

95 శాతం, అంతకంటే ఎక్కువ 

విద్యార్థులు  

9104

1717


పాఠశాలల వారీగా తులనాత్మక పనితీరు 2020 :

క్రమ సంఖ్య 

పాఠశాల  ఉత్తీర్ణతా శాతం 

I

కే.వి.ఎస్. 

99.23

II

జే.ఎన్.వి. 

98.66

III

సి.టి.ఎస్.ఏ. 

93.67

IV

స్వతంత్ర 

92.81

V

ప్రభుత్వ 

80.91

VI

ప్రభుత్వ సహాయంతో 

77.82

 

5

కేంద్రీయ విద్యాలయాలలో అఖిల భారత స్థాయిలో ప్రధమ స్థానంలో ఉన్నవారు : 

కేంద్రీయ విద్యాలయ, సంబల్పూర్ ఒ.డి.కి చెందిన అభయ్ నాయక్ మొత్తం 500 మార్కులలో 497 మార్కులు (99.4 శాతం) సాధించారు.

*****



(Release ID: 1639155) Visitor Counter : 164