నౌకారవాణా మంత్రిత్వ శాఖ

నార్వేలోని అస్కో మారిటైమ్ ఏఎస్ కోసం అటానమస్ ఎలక్ట్రిక్ నౌక నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్

నౌకా నిర్మాణ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సిఎస్‌ఎల్‌కు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంస

Posted On: 16 JUL 2020 4:42PM by PIB Hyderabad

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్‌ఎల్)-కొచ్చి, నార్వేలోని అస్కో మారిటైమ్ ఎఎస్ కోసం రెండు అటానమస్ ఎలక్ట్రిక్ ఫెర్రీ నిర్మాణం, సరఫరా కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. సమానమైన రెండు నౌకలను కూడా నిర్మించే సౌకర్యం ఉంది. 

నార్వేలోని అస్కో మారిటైమ్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ నౌకను నిర్మించడానికి కాంట్రాక్టును స్వాధీనం చేసుకున్నందుకు సిఎస్ఎల్ ను కేంద్ర విదేశాంగ మంత్రి (ఐ / సి) శ్రీ మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని వేశారన్నారు. సిఎస్ఎల్ తనకున్న మంచి విశ్వసనీయత, చరిత్రతో వివిధ గ్లోబల్ షిప్‌యార్డులతో పోటీ పడటం ద్వారా, కాంట్రాక్టును సాధించిందని శ్రీ మాండవియా చెప్పారు.

 

Description: twitter CSl.PNG

సిఎస్ఎల్ భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య నౌకానిర్మాణ సంస్థ. నార్వేజియన్ రిటైల్ విభాగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన నార్జెస్ గ్రుపెన్ ఎఎస్ఏ అనుబంధ సమూహమైన అస్కో  మారిటైమ్ ఏఎస్ నుండి ఈ ప్రతిష్టాత్మక ఎగుమతి ఆర్డర్‌ను కంపెనీ కైవసం చేసుకుంది. ఈ అటానమస్ ఎలక్ట్రికల్ నౌక ప్రాజెక్ట్ నార్వేలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, నార్వే ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూర్చింది ఓస్లో ఫ్జోర్డ్ అంతటా వస్తువుల ఉద్గార రహిత రవాణా దీని లక్ష్యం. ఈ నౌకలు  మెసెర్స్  మాస్టెర్లీ ఏఎస్  నిర్వహణలో ఉంటాయి. సాంకేతిక నిర్వహణను తీసుకొని స్వయంప్రతిపత్త నౌకలను నిర్వహించే మొట్టమొదటి సంస్థ ఇది. మెసెర్స్   కోంగ్స్‌బర్గ్,  అటానమస్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి మెసెర్స్  విల్హెల్మ్సెన్ మధ్య జాయింట్ వెంచర్, అతిపెద్ద మారిటైమ్ షిప్పింగ్ కంపెనీలలో ఒకటి. ఆపరేషన్‌లో ఉన్నప్పుడు, ఈ నౌక కర్బన రహిత  ఉద్గారంతో అటానమస్ వెస్సల్స్ రంగంలో వ్యాపారి షిప్పింగ్ ప్రపంచానికి కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తుంది.

67 మీటర్ల పొడవైన ఓడలు మొదట 1846 కిలోవాట్అవర్ సామర్థ్యం గల బ్యాటరీతో శక్తినిచ్చే పూర్తి-విద్యుత్ రవాణా ఫెర్రీగా తయారు చేసి అందజేస్తారు. నార్వేలో స్వయంప్రతిపత్త పరికరాలు ఫీల్డ్ ట్రయల్స్ ప్రారంభించిన తరువాత, ఇది పూర్తి స్వయంప్రతిపత్త ఫెర్రీగా పనిచేస్తుంది. ఇది పూర్తిగా లోడ్ చేసిన 16 ప్రామాణిక ఈయు ట్రెయిలర్‌లను ఒకేసారి  జోర్డ్ (భూభాగంపైకి కొద్దిగా చొచ్చుకు వఛ్చిన సముద్ర జలాల మార్గం) అంతటా రవాణా చేయగలదు. నౌకల డైనమిక్స్ నార్వే చేత కాంగ్స్‌బర్గ్ మారిటైమ్ వ్యవస్థలను ఉపయోగించి రూపొందించారు, వివరణాత్మక ఇంజనీరింగ్‌ను సిఎస్‌ఎల్ నిర్వహిస్తుంది. అవి డిఎన్‌వి జిఎల్ వర్గీకరణ కింద నిర్మితమవుతాయి, నార్వేలో ఫ్లాగ్ అవుతాయి.

వివిధ గ్లోబల్ షిప్‌యార్డుల వివరణాత్మక మూల్యాంకనం, కస్టమర్‌కు దాని విలువ ప్రతిపాదన ఆధారంగా సిఎస్ఎల్ ఈ ఎగుమతి ఆర్డర్ ని కైవసం చేసుకుంది. పశ్చిమ ఐరోపాలోని ప్రతిష్టాత్మక ఖాతాదారులకు ప్రపంచ నాణ్యమైన హై-ఎండ్ ఓడలను అందించడానికి సిఎస్ఎల్ నిరూపితమైన సామర్ధ్యం & ట్రాక్ రికార్డ్ కూడా ఎంపికకు అనుకూలంగా ఉంది. మహమ్మారి ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిమితుల్లో అధిక ప్రాముఖ్యతతో పొందిన ఈ ఒప్పందాన్ని సిఎస్ఎల్ కలిగి ఉంది. కొచ్చి వాటర్ మెట్రో కోసం సిఎస్ఎల్ ఇప్పటికే 23 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బోట్లను నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ తో  సిఎస్ఎల్- ప్రపంచంలోని ప్రీమియర్ షిప్‌బిల్డింగ్ యార్డుల హైటెక్ నౌకల నిర్మాణాన్ని చేపట్టగల కూటమిలోకి  చేరుతుంది.

***********



(Release ID: 1639153) Visitor Counter : 162