ప్రధాన మంత్రి కార్యాలయం

పదిహేనో ఇండియా-ఇయు (వర్చువల్) సమిట్ ప్రారంభమైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 15 JUL 2020 5:16PM by PIB Hyderabad

ఎక్సె లెన్సీస్, నమస్కారములు.

మార్చి మాసం లో జరగవలసివున్న ఇండియా-ఇయు సమిట్ ను కోవిడ్-19 కారణం గా మనం వాయిదా వేసుకోవలసివచ్చింది.  మనం ఈ రోజు న ఒక వర్చువల్ మాధ్యమం ద్వారా సమావేశం అవుతూవుండడం ఒక శుభ పరిణామంగా ఉన్నది.  అన్నిటి కంటే ముందు గా, నేను కరోనావైరస్ కారణం గా యూరోప్ లో వాటిల్లిన ప్రాణనష్టానికి గాను నా యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.  మీ ప్రారంభిక వచనాలకు గాను ఇవే నా యొక్క ధన్యవాదములు.  మీకు మల్లేనే, నేను కూడా భారతదేశానికి మరియు ఇయు కు మధ్య సంబంధాల ను పటిష్టపరచడం కోసం, ఆ సంబంధాల ను గాఢతరం గా మలచడం కోసం కంకణం కట్టుకొన్నాను.  దీనికోసం మనం ఒక దీర్ఘకాలీన వ్యూహాత్మక దృష్టికోణాన్ని తప్పక అనుసరించాలి.

దీనికి తోడు, ఒక ఆచరణోన్ముఖమైనటువంటి కార్యసూచీ ని ఆవిష్కరించాలి; స్పష్టం గా నిర్ణయించిన కాలావధి లోపల అమలు పరచే విధం గా ఆ కార్యసూచీ ఉండాలి.  మన భాగస్వామ్యం ప్రపంచం లో శాంతి కి మరియు స్థిరత్వానికి సైతం ఉపయోగకారి గా ఉన్నది.  ఈ వాస్తవికత ప్రపంచం లో ఇప్పుడు నెలకొన్నటువంటి స్థితి లో మరింత స్పష్టం అయిపోయింది.

మన ఉభయ పక్షాలు ప్రజాస్వామ్యం, బహుతావాదం, సమ్మిళితవాదం, అంతర్జాతీయ సంస్థ ల పట్ల గౌరవం, బహుళపాక్షికప్రాధాన్యవాదం, స్వేచ్ఛ ఇంకా పారదర్శకత్వం ల వంటి సార్వజనీన విలువ ల ను సమాదరిస్తూ వస్తున్నాయి.  కోవిడ్-19 తెర మీదకు వచ్చిన తరువాత, ప్రపంచం లో ఆర్థిక రంగం లో క్రొత్త సమస్య లు తలెత్తాయి.  ఈ స్థితి లో ప్రజాస్వామిక దేశాల మధ్య మరింత అధిక సహకారం నెలకొనాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

ప్రస్తుతం, మన పౌరుల యొక్క ఆరోగ్యం తో పాటు వారి సమృద్ధి సైతం సవాళ్ల ను ఎదుర్కొంటున్నాయి.  నియమాలపై ఆధారపడ్డ అంతర్జాతీయ క్రమాన్ని విధ విధాలైన ఒత్తిడులు ప్రభావితం చేస్తున్నాయి.  ఈ పరిస్థితుల లో, ఆర్థిక పునర్ నిర్మాణం లో, మానవ కేంద్రితమైన మరియు మానవత ప్రధానమైన ప్రపంచీకరణ ను నిర్మించడం లో ఇండియా-ఇయు భాగస్వామ్యం ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతుంది.  వర్తమాన సవాళ్ల కు తోడు, భారతదేశానికి మరియు ఇయు కు జల వాయు పరివర్తన వంటి దీర్ఘకాల సవాళ్లు ఓ ప్రాధాన్యం గా ఉన్నాయి.

భారతదేశం లో అక్షయ శక్తి యొక్క వినియోగాన్ని పెంచేందుకు గాను మేము చేపట్టిన ప్రయాసల లో భాగం గా యూరోప్ నుండి సాంకేతిక విజ్ఞానాన్ని మరియు పెట్టుబడి ని మేము ఆహ్వానిస్తున్నాము.  ఈ వర్చువల్ సమిట్ ద్వారా మన సంబంధాలు జోరు ను అందుకొంటాయని నేను ఆశిస్తున్నాను. 

ఎక్స్ లెన్సీస్, మీ తో మాట్లాడేందుకు ఈ యొక్క అవకాశం లభించినందుకు గాను నేను మరొక్క సారి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. 
 

***


(Release ID: 1638931) Visitor Counter : 354